Share News

Delhi: పోలింగ్‌ శాతాల్లో తేడాలపై డౌట్‌.. ఇండియా కూటమి నేతలకు ఖర్గే లేఖ

ABN , Publish Date - May 08 , 2024 | 08:46 AM

లోక్‌సభ మొదటి, రెండో దశ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్‌ శాతాల్లో భారీ వ్యత్యాసాలు ఉండడం ఆ సంస్థ నిష్పక్షపాతతపై అనుమానాలను కలిగిస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అన్నారు.

Delhi: పోలింగ్‌ శాతాల్లో తేడాలపై డౌట్‌.. ఇండియా కూటమి నేతలకు ఖర్గే లేఖ

ఢిల్లీ: లోక్‌సభ మొదటి, రెండో దశ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్‌ శాతాల్లో భారీ వ్యత్యాసాలు ఉండడం ఆ సంస్థ నిష్పక్షపాతతపై అనుమానాలను కలిగిస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత భారీ స్థాయిలో పోలింగ్‌ శాతాల్లో తేడాలు ఉండడం ఇదివరకెన్నడూ చూడలేదని తెలిపారు.

ప్రజాస్వామ్య విలువలు, భారత రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులుగా ఇండియా కూటమిలోని పార్టీల నాయకులు పోలింగ్‌ శాతంలో భారీ తేడాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు. ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించిందని పేర్కొంటూ కూటమి పార్టీల నాయకులకు మంగళవారం లేఖ రాశారు.

ఇది కూడా చదవండి:

West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి


IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 08:46 AM