LokSabha Elections: అధికారం కోసం మోదీ అండ్ కో ఎంతకైనా..
ABN , Publish Date - May 07 , 2024 | 06:22 PM
ఈ ఎన్నికల్లో ఎలాగైన అధికారం అందుకోవాలని ప్రధాని మోదీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు.. మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీతోపాటు ఆయన పార్టీపై సోనియాగాంధీ గాంధీ మండిపడ్డారు.
న్యూఢిల్లీ, మే 07: ఈ ఎన్నికల్లో ఎలాగైన అధికారం అందుకోవాలని ప్రధాని మోదీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు.. మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీతోపాటు ఆయన పార్టీపై సోనియాగాంధీ గాంధీ మండిపడ్డారు.
మంగళవారం సోనియాగాంధీ మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. దేశంలో ప్రతిచోట నిరుద్యోగం తాండవిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందారు. దళితులు, తెగల వారు, వెనకబడిన వర్గాలు, మైనార్టీలు తీవ్రంగా అంతరాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
AP Elections 2024: జగన్ గెలుపు కోసం కేసీఆర్ అండ్ కో ఆరాటం..!
ఈ విధమైన వాతావరణం దేశంలో ఏర్పాడడానికి కారణం ప్రధాని మోదీతోపాటు అయన పార్టీ అని సోనియాగాంధీ ఈ సందర్బంగా అభివర్ణించారు. రాజకీయ లబ్ది కోసం వారు ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని వర్గాల అభ్యున్నతికి పాటు పడిందని గుర్తు చేశారు.
అంతేకాదు.. దేశాన్ని ధృడపరచడమే కాకుండా.. అందరికీ న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుందని సోనియా గాంధీ వివరించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి అంకితభావంతో పని చేస్తుందని స్పష్టం చేశారు.
LokSabha Elections: అఖిలేష్ యాదవ్ ప్రత్యేక పూజలు.. ఆలయాన్ని శుద్ది చేసిన బీజేపీ శ్రేణులు
ఆ క్రమంలో సమైక్య భారత దేశం కోసం.. దేశ దృఢమైన నిర్మాణం కోసం... భవిష్యత్తు మరింత మెరుగుగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని దేశ ప్రజలకు సోనియా గాంధీ సందేశాన్ని ఇచ్చారు.
Read Latest National News and Telugu News