Home » INDIA Alliance
'ఇండియా' కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ప్రతిపాదించినప్పటి నుంచి భాగస్వామ్య పార్టీల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మమతా బెనర్జీ, కేజ్రీవాల్ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ వ్యక్తం చేశారు. ప్రధాని పేరును ప్రకటించనంత మాత్రాన కోల్పోయేదేమీ ఉండదన్నారు.
లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి సీట్ల పంపకాలపై చర్చలను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్ర శాఖల నేతలతో డిసెంబర్ 29న చర్చలు జరుపనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ విపక్షంలో ఉంది.
ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు నేతలు ఇటీవల ప్రతిపాదించడంపై కూటమిలో చీలక ఏర్పడవచ్చనే ఊహాగానాలను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తెరదించే ప్రయత్నం చేశారు. కూటమిలో పోస్ట్ కోసం తాను ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.
ఇండియా బ్లాక్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను ప్రధాని అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించడంపై జేడీయూ గుర్రమంటోంది. తాజాగా జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ నిప్పులు చెరిగారు. ''అసలు ఖర్గే ఎవరు? ఆయన గురించి ఎవరికీ తెలియదు? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పీఎం అభ్యర్థి కావాలి'' ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంకకాల అంశం 'ఇండియా' కూటమికి మఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో పొత్తుల వ్యవహారం ఇంకా మంతనాల స్థాయిలోనే ఉండగానే మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన 23 లోక్‌సభ స్థానాలలో తాము పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్‌లో పొత్తుల విషయంలో బహుజన్ సమాజ్ పార్టీని దూరంగా పెట్టాలని ఇండియా కూటమి నాలుగో సమావేశంలో కాంగ్రెస్‌ను అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ కోరినట్టు తెలుస్తోంది.
ఇండియా కూటమి నాలుగో సమావేశం విజయవంతమైనట్టు కూటమి నేతలు ఇప్పటికే ప్రకటించుకోగా, భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) ఎంపీ సునీల్ కుమార్ పింటూ మాత్రం బుధవారంనాడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''సమోసా లేకుండా ఇండియా బ్లాక్ సమావేశం ముగిసింది'' అంటూ చమత్కరించారు. సమావేశంలో చెప్పుకోదగిన చర్చేమీ జరగలేదన్నారు.
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాలు చేసే పొలిటికల్ సూపర్స్టార్ల జాబితాను విపక్ష ఇండియా కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి మంగళవారం సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. నితీష్ కుమార్, ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఇండియా కూటమి నాలుగో సమావేశం మంగళవారంనాడు విజయవంతంగా ముగిసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై సమష్టి పోరాటంపైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంటులో చోటు చేసుకున్న ఘటనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సీట్ల సర్దుబాటు అంశంపైనా చర్చ జరిగింది.
ఇండియా కూటమి నాలుగవ సమావేశం న్యూఢిల్లీలోని అశోక హోటల్‌పై మంగళవారంనాడు మొదలైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, టీఎంసీ చీప్ మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, తదితరులు పాల్గొన్నారు.