Home » INDIA Alliance
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరికొన్ని గంటల్లోనే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు...
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్(272)ని దాటి 293 స్థానాలు గెలుపొందడంతో.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా..
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి(INDIA Alliance) గణీనయమైన సీట్లు సాధించడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య పాత్ర పోషించారని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 99 స్థానాలకు గెలుచుకుంది. అయితే మహారాష్ట్ర సింగ్లి లోక్సభ సభ్యుడు విశాల్ పాటిల్.. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రోజులు గడుస్తున్నా కొద్ది హస్తిన రాజకీయాలు మరింత రక్తికట్టిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కొద్ది మంది సభ్యులు మాత్రమే తక్కువగా ఉండటంతో.. ఆ సభ్యులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే.. చేరికలను ప్రోత్సహిస్తోంది. తాజాగా మహారాష్ట్ర సంగ్లీ లోక్సభ స్వతంత్ర ఎంపీ విశాల్ ప్రకాష్ బాబు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంపై ఒకప్పుడు కాంగ్రెస్ నేతలతోపాటు, ఇండియా కూటమి(INDIA Alliance) నేతలకు ఓ సందేహం ఉండేది. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఆ సందేహం తీరిపోయింది.
‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? అనేది మళ్లీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఆ ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ప్రజాతీర్పు వ్యక్తిగతంగా మోదీకి రాజకీయ ఓటమి మాత్రమే కాకుండా నైతికపరమైన ఓటమి కూడా అని అభివర్ణించారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమి 293 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఇండియా భాగస్వామ్య పక్షాలు 233 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 17 స్థానాల్లో గెలిచారు. దీంతో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం సైతం ఖరారు అయింది.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను సమీక్షించేందుకు 'ఇండియా' కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జేఎఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తదితరులు హాజరయ్యారు.