Share News

Parliament Budget Session 2024 live updates: పేపర్ లీకేజీపై లోక్‌సభలో..

ABN , First Publish Date - Jul 22 , 2024 | 10:26 AM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు.

Parliament Budget Session 2024 live updates: పేపర్ లీకేజీపై లోక్‌సభలో..
Lok Sabha Session

Live News & Update

  • 2024-07-22T12:07:31+05:30

    జీరో అవర్ ప్రారంభం..

    • లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా జీరో అవర్‌ను ప్రారంభించారు.

    • వివిధ సమస్యలపై లోక్‌సభ సభ్యులు ప్రస్తావిస్తున్నారు.

  • 2024-07-22T12:03:51+05:30

    ఆర్థిక సర్వే..

    • ఆర్థిక సర్వే 2023-24ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

  • 2024-07-22T11:42:03+05:30

    నిధుల మళ్లింపుపై..

    • ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించిందని.. అదే క్రమంలో భారీ అవినీతి జరిగిందనే విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

    • ఎంపీ సూచనను పరిగణలోకి తీసుకుని.. పూర్తి వివరాలు తెలుసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి సభలో తెలిపారు.

  • 2024-07-22T11:35:31+05:30

    ఏపీకి నిధులపై..

    • ఆంధ్రప్రదేశ్‌కు గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారని చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నించారు.

    • కేంద్రప్రయోజిత పథకాలకు రాష్ట్రప్రభుత్వం ఎంతమేరకు తన వాటా మొత్తాన్ని చెల్లించిందని లోక్‌సభలో ప్రశ్నించారు.

    • గత ప్రభుత్వం తప్పిదాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ఏపీ అభివృద్ధికి కేంద్రంపూర్తిస్థాయిలో సహకరించాలని దుర్గాప్రసాద్ కోరారు.

  • 2024-07-22T11:34:51+05:30

    పేపర్ లీకేజీపై..

    • నీట్ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ప్రశ్నించారు. గత ఏడేళ్లలో 70 సార్లు పేపర్ లీక్ అయిందని.. నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

    • ఏడేళ్లలో 70 సార్లు పేపర్ లీకేజీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ తెలిపారు. కేవలం అవి ఆరోపణలు మాత్రమేనని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీపై బీహార్ పోలీసులు, సీబీఐ విచారణ జరుగతుదంని, ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈకేసును ప్రత్యేకంగా విచారిస్తోందని తెలిపారు.

      పేపర్ లీకేజీపై రాహుల్..

    • పేపర్ లీకేజీపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలోని విద్యార్థులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.

    • పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని.. పరీక్ష విధానంలో తప్పులు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారని రాహుల్ అన్నారు.

    • రాహుల్ వ్యాఖ్యలను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ ఖండించారు. తమకు పూర్తి అవగాహన ఉందని, అనవసరంగా ఈ అంశంపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, తనకు సభలో రాహుల్ సర్టిఫికెట్ అవసరం లేదని.. ప్రజలు తమపై విశ్వాసంతో అధికారం అప్పగించారన్నారు.

    • రాహుల్ గాంధీ ప్రకటన దురదృష్టకరమని ధర్మేంద్రప్రదాన్ అన్నారు. రాహుల్ దగ్గర తాను సర్టిఫికెట్ తీసుకోవల్సిన అవసరం లేదన్నారు. రిమోట్‌గా ప్రభుత్వాన్ని నడిపే వారు ప్రకటనలు ఇస్తున్నారని ఎద్దెవా చేశారు. వ్యవస్థను మెరుగుపరచడానికి సూచనలు ఇస్తే బాగుంటుందన్నారు.

  • 2024-07-22T11:08:08+05:30

    ప్రశ్నోత్తరాలు ప్రారంభం..

    • లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు.

    • కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై రాజస్థాన్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కశ్వాన్ ప్రశ్నకు విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి సమాధానమిచ్చారు.

  • 2024-07-22T11:03:39+05:30

    ఎంపీగా శత్రుఘ్న సిన్హా‌ ప్రమాణం

    • పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా‌ ఎంపీగా ప్రమాణం చేశారు.

  • 2024-07-22T10:56:11+05:30

    తెలుగు ఎంపీల ప్రశ్నలు ఇవే..

    • చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆర్థిక మంత్రిత్వశాఖకు సంబంధించిన ప్రశ్నలు లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో అడగనున్నారు.

    • కేంద్రప్రభుత్వ స్పాన్సర్డ్ పథకాలకు సంబంధించి గత ఐదేళ్లుగా ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చారనేదానిపై ఇద్దరు ఎంపీలు ప్రశ్నలు వేయనున్నారు.

  • 2024-07-22T10:52:30+05:30

    ఎంపీ ప్రమాణం తర్వాత..

    • అసన్‌సోల్ ఎంపీ ప్రమాణం తర్వాత ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపడతారు.

    • ప్రశ్నోత్తరాల్లో భాగంగా మొదట విద్యాశాఖకు సంబంధించి రాజస్థాన్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కశ్వాన్, కర్ణాటక బీజేపీ ఎంపీ గోవింద్ కర్జోల్ ప్రశ్నలు అడగనున్నారు.

    • రాజస్థాన్, కర్ణాటకలో కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై ఇద్దరు ఎంపీలు ప్రశ్నలు వేయనున్నారు.

  • 2024-07-22T10:44:14+05:30

    తొలుత ఎంపీ ప్రమాణం..

    • లోక్‌సభ ప్రారంభం కాగానే మొదట పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా‌తో లోక్‌సభ స్పీకర్ ప్రమాణం చేయిస్తారు.

    • శత్రుఘ్న సిన్హాకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఇప్పటివరకు ఎంపీగా ప్రమాణం చేయలేదు.

  • 2024-07-22T10:27:46+05:30

    పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

    • పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి.

    • సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడతారు.

    • సభలో సమన్వయం కోసం ప్రతిపక్ష నేతలంతా సమావేశమవుతారు.