Union Budget 2024 live updates: కొత్త పథకాలు.. వేతన జీవులకు ఊరట.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..
ABN , First Publish Date - Jul 23 , 2024 | 08:26 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు.
Live News & Update
-
2024-07-23T14:10:28+05:30
బడ్జెట్‌పై మోదీ స్పందన..
2024-25 వార్షిక బడ్జెట్ అద్భుతంగా ఉంది
ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చే బడ్జెట్
యువత ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంది
ఉపాధి అవకాశాలను పెంచేదిగా బడ్జెట్ ఉంది
యువ పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేలా బడ్జెట్ ఉంది
-
2024-07-23T12:31:44+05:30
లోక్‌సభ వాయిదా..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత సభను స్పీకర్ ఓంబిర్లా బుధవారానికి వాయిదా వేశారు.
-
2024-07-23T12:29:59+05:30
జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక బడ్జెట్..
జమ్మూ, కశ్మీర్ ప్రత్యేక బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సమర్పించారు.
-
2024-07-23T12:27:17+05:30
బడ్జెట్ మొత్తం ఎంతంటే....
కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు
మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
ద్రవ్యలోటు 4.9 శాతంగా (అంచనా)
అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు(అంచనా)
-
2024-07-23T12:23:29+05:30
తగ్గనున్న ధరలు..
మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను తక్కువ ధరకు అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
చేపలు తక్కువ ధరకే లభిస్తాయన్నారు. తోలుతో చేసిన సామాగ్రి ధరలు తగ్గుతాయన్నారు. బంగారం, వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గనున్నట్లు బడ్జెట్‌లో తెలిపారు.
-
2024-07-23T12:21:25+05:30
తక్కువ ధరకు మందులు..
కస్టమ్ డ్యూటీ ఫ్రీగా మూడు రకాల ఔషధాలు. తక్కువ ధరకు లభించనున్న మూడు రకాల ఔషధాలు
-
2024-07-23T12:19:20+05:30
నెలకు రూ.5వేల భృతి..
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు రూ. నెలవారీ భత్యం రూ. 5,000 ఇవ్వనున్నట్లు ప్రకటన
అస్సాంలో వరద నియంత్రణ కార్యకలాపాలకు, బీహార్‌లోని కోసికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం
ఇంధన భద్రత, పరివర్తన కోసం కొత్త పాలసీ
పీఎం ఆవాస్ యోజన-అర్బన్ 2.0 కింద రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడితో కోటి కుటుంబాలకు ఇళ్లు
పట్టణాల్లో గృహ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు వడ్డీ రాయితీ పథకం అమలు
-
2024-07-23T12:09:38+05:30
బీహార్ కోసం..
బీహార్‌కు కేంద్రం ప్రత్యేక నిధులను కేటాయించింది. కాశీ విశ్వనాథుడి తరహాలో విష్ణుపాద దేవాలయం, మహాబోధి ఆలయాలను అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
-
2024-07-23T12:02:08+05:30
బడ్జెట్‌లో కీలక అంశాలు..
మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపు
పారిశ్రమలలో పనిచేసే కార్మికుల కోసం రెంటల్ సిస్టమ్‌లో డార్మిటరీ వసతి సౌకర్యం
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకారం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీ
బీహార్‌లో వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లు కేటాయింపు
పీపీపీ పద్ధతిలో బీహార్ అబివృద్ధికి ఆర్థిక సహాయం
బీహార్‌లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
5 రాష్ట్రాల్లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ
బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక పథకం
-
2024-07-23T11:51:14+05:30
బడ్జెట్‌లో కీలక ప్రకటనలు..
ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖలు ఏర్పాటు
బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు
దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం
గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు
ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థులకు నేరుగా ఇ-వోచర్లను అందజేయడం ద్వారా మొత్తం రుణంపైమూడు శాతం వడ్డీ రాయితీ.
అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం
రూ.26వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసుకున్న లక్ష కంటే తక్కువ జీతం ఉన్న మొదటి సారి ఉద్యోగులకు 3 వాయిదాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద ఒక నెల జీతంలో రూ. 15,000 వరకు ఇవ్వనున్నట్లు ప్రకటన
రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు వేగవంతంపై ప్రత్యేక దృష్టి
-
2024-07-23T11:41:51+05:30
ఏపీ, బీహార్‌కు వరాలు..
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బీహార్‌లకు ప్రభుత్వం భారీగా వరాలు ప్రకటించింది. ఏపీకిరూ.50 వేల కోట్లు అదనంగా ఇస్తామని ప్రకటించగా.. బీహార్‌లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
-
2024-07-23T11:39:39+05:30
ఉన్నత విద్య కోసం రుణాలు..
ప్రతి సంవత్సరం 25వేల మంది విద్యార్థులకు సహాయం చేయడానికి మోడల్ స్కిల్ లోన్ స్కీమ్‌ను ప్రతిపాదిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ-వోచర్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం అందిస్తామని.. ప్రతి సంవత్సరం, దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం లక్ష మంది విద్యార్థులకు 3శాతం వార్షిక వడ్డీతో నేరుగా రూ.10 లక్షల రుణం ఇస్తామన్నారు.
-
2024-07-23T11:36:12+05:30
9 ప్రాధాన్యతలపై దృష్టి..
వాతావరణానికి అనుకూలమైన విత్తనాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పరిశోధనలపై దృష్టిపెట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీతారామన్ తెలిపారు.
రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రోత్సాహం
కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు.
ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాల కోసం మూడు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
-
2024-07-23T11:30:45+05:30
ఏపీకి ప్రత్యేక సహాయం..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.
ప్రత్యేక ఆర్థిక సహకారం అందిచనున్నట్లు తెలిపారు.
2024-25 బడ్జెట్‌లో ఏపీ అభివృద్ధికి రూ.15వేల కోట్ల రూపాయిల నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం
పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు
విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు
విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం
రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు నిధులు
-
2024-07-23T11:24:34+05:30
స్కిల్ డెవలప్‌మెంట్‌పై..
ఈ బడ్జెట్‌లో ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్‌ఎంఇ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. 2 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 5 సంవత్సరాల కాలంలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
-
2024-07-23T11:21:50+05:30
కీలక అంశాలు ఇవే..!
మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా, పేదలు, మహిళలు, యువత, రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రధాన పంటలన్నింటికీ కనీస మద్దతు ధరలను ప్రకటించామన్నారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపు ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రయోజనం పొందారన్నారు.
-
2024-07-23T11:17:52+05:30
పీఎం గరీభ్ కళ్యాణ్ యోజన పొడిగింపు
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను 5 సంవత్సరాలు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
-
2024-07-23T11:15:45+05:30
ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం..
దేశంలో ద్రవ్యోల్బణం రేటు దాదాపు 4 శాతంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలకు విశ్వాసం ఉందని చెప్పారు.
-
2024-07-23T11:09:19+05:30
యూత్‌కు గుడ్ న్యూస్..
ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి
స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి
-
2024-07-23T11:07:04+05:30
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
తమ ప్రభుత్వంలో దేశ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందన్నారు.
మోదీ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, పేద ప్రజలపై ప్రత్యేక దృష్టిసారిస్తుందన్నారు.
రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు తెలిపారు.
-
2024-07-23T11:01:20+05:30
లోక్‌సభ ప్రారంభం..
లోక్‌సభ ప్రారంభమైంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.
-
2024-07-23T10:59:57+05:30
కేబినెట్ ఆమోదం..
కేంద్ర బడ్జెట్ 2024-25కు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-
2024-07-23T10:58:00+05:30
నిర్మలకు స్వీట్ పెట్టిన రాష్ట్రపతి..
రాష్ట్రపతిని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కలవగా.. ఆమెకు ద్రౌపది ముర్ము స్వీట్ తినిపించి.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు.
-
2024-07-23T10:55:01+05:30
రాష్ట్రపతిని కలిసిన నిర్మల
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రప్రతి ద్రౌపదిముర్మును కలిశారు.
-
2024-07-23T10:34:55+05:30
కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు..
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. బడ్జెట్ ద్వారా, ప్రధాని తనకు సన్నిహితంగా ఉన్న మిలియనీర్లకు సహాయం చేస్తారని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలకు, నిజాయితీ పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ప్రయోజనాలు బడ్జెట్ ద్వారా ఉండబోవన్నారు.
-
2024-07-23T10:27:10+05:30
పార్లమెంట్‌కు కేంద్రమంత్రులు..
కేబినెట్ సమావేశం కోసం కేంద్రమంత్రులు పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాసేపట్లో బడ్జెట్‌కు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలపనుంది.
-
2024-07-23T10:10:58+05:30
పార్లమెంట్‌కు ఆర్థిక మంత్రి..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు.
-
2024-07-23T10:07:40+05:30
పార్లమెంట్‌కు చేరిన బడ్జెట్ కాపీలు..
బడ్జెట్ కాఫీలు పార్లమెంట్‌కు చేరుకున్నాయి. సభ్యులకు బడ్జెట్ కాఫీలను అందజేస్తారు. అదే విధంగా డిజిటల్ రూపంలో పీడీఎఫ్ కాపీని సభ్యులకు షేర్ చేస్తారు.
-
2024-07-23T10:04:54+05:30
బడ్జెట్ ఉన్న టాబ్లెట్..
నిర్మలా సీతారామన్ బడ్జెట్ డిజిటల్ విధానంలో ప్రవేశపెట్టనున్నారు. గతంలో పేపర్ల ద్వారా బడ్జెట్ లోక్‌సభకు సమర్పించగా.. కొన్నేళ్లుగా డిజిటల్ విధానంలో బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం ఉన్న టాబ్లెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు చూపించారు.
ఎరుపు రంగు కలిగిన క్లాత్ బ్యాగ్‌తో నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకుంటారు.
-
2024-07-23T09:52:58+05:30
లాభాల సూచీలో సెన్సెక్స్..
సెన్సెక్స్ లాభాలతో ప్రారంభమైంది. బడ్జెట్ సమర్పణకు ముందు 229.89 పాయింట్లు పెరిగి 80,731.97 వద్ద ట్రేడ్ అవుతోంది.
-
2024-07-23T09:49:54+05:30
తన టీమ్‌తో..
బడ్జెట్ సమర్పణకు ముందు తన టీమ్‌తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
-
2024-07-23T09:46:57+05:30
బడ్జెట్‌కు ముందు..
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతులను మీడియాకు చూపించారు.
ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో కలిసి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకుంటారు.
-
2024-07-23T09:33:24+05:30
కార్యాలయానికి ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆమె తన కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
-
2024-07-23T09:27:10+05:30
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపుపై..
ఉపాధి అవకాశాల పెంపుపై కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టే అవకాశాలున్నాయి. గ్రీన్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తూ పలు నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.
దేశీయంగా తయారీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి దిగుమతి-ఎగుమతి సుంకాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. రైల్వే రంగానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
-
2024-07-23T09:17:56+05:30
రైతులకు వరాలు..
రైతుల సంక్షేమంపై కేంద్రం దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. రైతుల కోసం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై రుణ పరిమితి పెంచే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది.
ఎలాంటి హామీ లేకుండా రైతులకు ఇచ్చే రుణం రూ.160,000 నుండి రూ.2,60,000 వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. పసుపు రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు బడ్జెట్‌లో ఉండే అవకాశం ఉంది.
-
2024-07-23T09:13:15+05:30
వృద్ధులకు శుభవార్త..!
వృద్ధులను ఆయుష్మాన్ పథకం కిందకు తీసుకొస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. దీనిపై బడ్జెట్‌లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించేలా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో వృద్ధులకు సంబంధించి నిర్దిష్ట నిర్ణయాలు తీసుకోలేదు. దీంతో ఈసారి బడ్జెట్‌లో ఆరోగ్య బీమా ప్రీమియం తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
-
2024-07-23T09:09:00+05:30
ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్..!
ఈరోజు ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. రూ.12 లక్షల వరకు పన్ను శ్లాబ్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
-
2024-07-23T08:24:21+05:30
కాసేపట్లో..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు లోక్‌సభకు సమర్పిస్తారు.
బడ్జెట్‌పై అంచనాలు..
పన్ను విధానంలో మార్పులు ఉండే అవకాశం
పొదుపు కోసం చర్యలు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేటాయింపులు పెంచే అవకాశం, ఉపాధి హామీ కూలీ రేట్లు పెరిగే ఛాన్స్
కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంపు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సులభంగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకునే అవకాశం