Share News

Union Budget 2024: అందరి చూపు బడ్జెట్‌వైపు.. సామాన్యుడి ఆశలు చిగురించేనా..!

ABN , Publish Date - Jul 23 , 2024 | 07:48 AM

మరికొన్ని గంటల్లో కేంద్రప్రభుత్వం 2024-25కి సంబంధించి పూర్తిస్థాయి భారతదేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దేశం మొత్తం బడ్జెట్ వైపు చూస్తోంది. సరిగ్గా 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

Union Budget 2024: అందరి చూపు బడ్జెట్‌వైపు.. సామాన్యుడి ఆశలు చిగురించేనా..!
Nirmala Sitharaman

మరికొన్ని గంటల్లో కేంద్రప్రభుత్వం 2024-25కి సంబంధించి పూర్తిస్థాయి భారతదేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దేశం మొత్తం బడ్జెట్ వైపు చూస్తోంది. సరిగ్గా 11 గంటలకు లోక్‌సభ (Lok Sabha)లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్‌లో ముఖ్యమైన అంశాలు, కేటాయింపులు, ప్రభుత్వ లక్ష్యాలను సభలో ఆమె వివరిస్తారు. నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం బడ్జెట్ సామాన్యుడి ఆశలను చిగురించేలా ఉంటుందా.. కార్పొరేటర్లను సంతృప్తి పరుస్తుందా.. ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రతి ఏడాది దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సాధారణమైన విషయమే. కానీ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఏ రంగాలకు ప్రాధాన్యతనిస్తోంది. ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు నిత్యావరసరాల వస్తువులపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది. పన్నుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదానిపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Economic Survey 2024: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఈసారి భారత్ వృద్ధి రేటు ఏంతంటే..


మొదటి బడ్జెట్..

వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటిసారి దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బడ్జెట్ ఉంటుందని.. ప్రభుత్వ దృష్టి మొత్తం ఆ విధంగానే ఉందని బడ్జెట్‌ సమావేశాల తొలిరోజే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. వ్యక్తిగత వినియోగ వ్యయంలో లోటును భర్తీ చేయడానికి, సామాన్యుడి కొనుగోలు శక్తి పెంచడానికి ప్రభుత్వం పన్ను రాయితీ కల్పించాల్సి ఉంటుంది. కార్పొరేట్ పెట్టుబడికి స్థిరత్వం తీసుకురావడం ప్రభుత్వానికి మరో పెద్ద సవాలుగా చెప్పుకోవచ్చు. పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి. పెట్టుబడులను ఆకర్షించడం కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికను రూపొందిస్తుందనేది కీలకంగా మారింది. బడ్జెట్‌పై ప్రతి వర్గానికి అంచనాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు ఎలాంటి బడ్జెట్ ఇవ్వబోతున్నారు.. ఎటువంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతున్నారనేది యావత్ దేశం ఎదురుచూస్తోంది.

Union Budget : అభివృద్ధి.. జనాకర్షకం


అందరి చూపు..

దేశ ప్రజల చూపు మంగళవారం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ వైపే ఉంది. ప్రతి రంగానికి సంబంధించి ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. రైతులు, ఉత్పాదక రంగంతో పాటు చిన్న, కుటీర పరిశ్రమలతో ముడిపడిన ప్రజలు బడ్జెట్‌లో తమకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయంలో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త పన్ను విధానంలో మార్పులు ఉంటాయా.. లేదా అనే దానిపై మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పొదుపు కోసం కొన్ని చర్యలు ఉండొచ్చని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) కోసం కేటాయింపులు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సదుపాయాన్ని మరింత సులభతరం చేసేందుకు బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. దేశ ప్రజల అంచనాలను నిర్మలా సీతారామన్ బడ్జెట్ అందుకుంటుందా.. సామాన్యుడి ఆశలను చిగురించేలా నిర్ణయాలు ఉంటాయా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.


Budget 2024: బడ్జెట్ 2024లో ఆయుష్మాన్ భారత్ నుంచి గుడ్ న్యూస్..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 23 , 2024 | 07:48 AM