Home » INDIA Alliance
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించేందుకు 'ఇండియా' కూటమి బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కూటమి నేతల సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే హాజరు కావడం లేదు.
‘‘బీజేపీని దెబ్బతీయాలంటే.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి. మనలో మనం పోటీ పడకూడదు..’’ గత ఏడాది జూలై 17న బెంగళూరులో జరిగిన ఇండియా కూటమి(40 పార్టీలు) సమావేశంలో
'ఇండియా' కూటమి నేతగా ఉన్న ఎన్సీపీ-ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పటికే జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ చీఫ్ ఎన్.చంద్రబాబునాయుడుతో మాట్లాడారంటూ ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అయితే, ఈ ఊహాగానాలను మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో శరద్పవార్ కొట్టివేశారు.
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్లో 'ఇండియా' కూటమి అనూహ్యమైన ఫలితాల దిశగా దూసుకు వెళ్తోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కంటే 'ఇండియా' బ్లాక్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
'ఎగ్జిట్ పోల్' ఫలితాలను కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ ఈనెల 4న జరిగే ఓట్ల లెక్కింపుపై భారీ అంచనాలతో ఉంది. ఇందులో భాగంగా 'ఇండియా' కూటమి నేతలను ఆ పార్టీ అప్రమత్తం చేసింది. మంగళవారం రాత్రి కౌటింగ్ పూర్తయ్యేంత వరకూ లేదా బుధవారం ఉదయం 5 గంటల వరకూ అంతా ఢిల్లీలోనే ఉండాలని కూటమి సీనియర్ నేతలకు విజ్ఞప్తి చేసింది.
ఓట్ల లెక్కింపు ముందు 150 జిల్లాల మేజిస్ట్రేట్లలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంతనాలు జరిపినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఈ అంశాన్ని ఈసీ దృష్టికి సైతం ఆయన తీసుకు వెళ్లారు.
'ఇండియా' కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని అడిగినప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తమాషా సమాధానమిచ్చారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా ''295 ట్రాక్''ను ప్రస్తావించారు.
లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఉత్కంఠభరిత వాతావరణం నడుమ 2024 లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారంతో ముగిసింది. ఓటర్ల మనోగతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి 295 సీట్లకు పైగా వస్తాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఆ సంఖ్య కూడా దాటవచ్చని, అంతకంటే మాత్రం తగ్గవని చెప్పారు.