Lok Sabha Updates: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. మోదీపై అఖిలేష్ సెటైర్లు..
ABN , Publish Date - Jul 02 , 2024 | 11:50 AM
లోక్‌సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.
లోక్‌సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొంటూ కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇండియా కూటమిదే నైతిక విజయమన్నారు. ఓడిపోయిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఎద్దెవా చేశారు.
Parliament: పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభం
2024 ఫలితాల ద్వారా భారతదేశ ప్రజలు బాధ్యతతో కూడిన సందేశాన్ని ఇచ్చారన్నారు. ఓటర్లకు అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలు ఓడిపోయాయన్నారు. భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకునేందుకు దేశ ప్రజలు ఓటు వేశారన్నారు. ప్రభుత్వ అహంకారాన్ని ప్రజలు ఓడించారన్నారు. ఈ ఎన్నికల్లో విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు.
NEET Exam : నీట్.. కమర్షియల్
యూపీలో అవినీతి..!
ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అన్ని అవాస్తవాలు చెబుతోందన్నారు. ఇండియా కూటమి అధికారం చేపడితే తక్షణమే అగ్నివీర్ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. ఇండియా కూటమి అగ్నివీర్‌ను వ్యతిరేకిస్తోందన్నారు. ఎంతోమంది యువత ఆకాంక్షలను అగ్నివీర్ నెరవేర్చడం లేదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందన్నారు.
Rahul Gandhi : మీరు హిందువులు కాదు!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News