Share News

Delhi : రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గింది

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:15 AM

రాజ్యసభలో నలుగురు నామినేటెడ్‌ సభ్యులు గత శనివారం పదవీ విరమణ చేయడంతో బీజేపీ బలం 86 సీట్లకు, ఎన్డీఏ బలం 101 సీట్లకు తగ్గిపోయింది.

Delhi : రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గింది

న్యూఢిల్లీ, జూలై 15(ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో నలుగురు నామినేటెడ్‌ సభ్యులు గత శనివారం పదవీ విరమణ చేయడంతో బీజేపీ బలం 86 సీట్లకు, ఎన్డీఏ బలం 101 సీట్లకు తగ్గిపోయింది. పదవీ విరమణ చేసిన నామినేటెడ్‌ సభ్యుల్లో సోనాల్‌ మాన్‌ సింగ్‌, సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ, ఆర్‌ఎ్‌సఎస్‌ సభ్యుడు రాకేశ్‌ సిన్హా, యూపీ బీజేపీ నేత రాంషకల్‌ ఉన్నారు.

సాధ్యమైనంత త్వరగా వీరి స్థానంలో మరో నలుగురిని నామినేట్‌ చేసి రాజ్యసభలో మళ్లీ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. మరోవైపు.. ఏపీ, తెలంగాణలో రాజకీయంగా క్లిష్ట దశను ఎదుర్కొంటున్న వైసీపీ, బీఆర్‌ఎస్‌ బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడ్డట్లు తెలిసింది. తాము బేషరతుగా మద్దతిస్తామని జగన్‌ లేఖ రాయగా, బీజేపీకి అండగా ఉండాలని తమ నలుగురు ఎంపీలకు బీఆర్‌ఎస్‌ సూచించినట్లు తెలిసింది.

అయితే, బీజేడీకి చెందిన 9 మంది, అన్నాడీఎంకేకు చెందిన నలుగురు సభ్యులు తటస్థంగా ఉండే అవకాశాలున్నాయి. రాజ్యసభలో ఇండియా కూటమికి 87మంది సభ్యులు ఉండగా, అందులో కాంగ్రె్‌సకు 26 మంది సభ్యులు ఉన్నారు. ఇటీవల కాంగ్రె్‌సలో చేరిన కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో అభిషేక్‌ సింఘ్వీని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

మొత్తంగా తెలంగాణతోపాటు హరియాణా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, త్రిపురలో ఒక్కో ఖాళీ, మహారాష్ట్ర, అస్సాం, బీహార్‌లో రెండేసీ చొప్పున సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. మొత్తం 11 సీట్లలో బీజేపీకి ఏడు సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. నామినేటెడ్‌ ఖాళీలను కూడా భర్తీ చేస్తే ఎన్డీఏ సంఖ్యాబలం 112 సీట్లకు పెరగనుంది. అయినప్పటికీ బిల్లుల ఆమోదానికి ఇతర పార్టీలపై ఆధారపడాల్సి ఉంటుంది.

Updated Date - Jul 16 , 2024 | 04:16 AM