Home » India vs West indies
రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడం లేదు. వీరిద్దరికి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు. దీంతో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ చారిత్రక రికార్డుకు 2 అడుగుల దూరంలో ఉన్నారు. రోహిత్ - కోహ్లీ కలిసి మరో 2 పరుగుల చేస్తే తమ వన్డే కెరీర్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటారు. దీంతో వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్న జోడిగా రికార్డు నెలకొల్పుతారు.
రెండో వన్డే మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు తప్పేలా కనిపించడంలేదు. బార్బడోస్‌లో ప్రస్తుతం ఎండ ఉన్నప్పటికీ మ్యాచ్ సమయానికి మబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో చిన్నపాటి జల్లులు, ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశాలున్నాయి.
టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో అతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/6), రవీంద్ర జడేజా (3/37) విండీస్ బ్యాటర్లను వణికించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌ను ఆరంభంలో పేసర్లు దెబ్బకొట్టగా తర్వాత స్పిన్నర్లు చుట్టేశారు.
వెస్టిండీస్‌తో మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. సిరాజ్ కాలి మడిమ నొప్పితో బాధపడుతున్నాడు. గాయం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా అతనికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.
టెస్ట్ సిరీస్(Test series)లో జోరు చూపించిన భారత జట్టు(Indian team).. మరో రెండు నెలల్లో స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌కప్(ODI World Cup) కోసం సన్నద్ధం కానుంది.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. విమానం కోసం ఎయిర్‌పోర్టులో ఏకంగా 4 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో భారత ఆటగాళ్లు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. ఆటగాళ్లకు రాత్రంతా నిద్ర కూడా లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన భారత ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. బార్బడోస్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లను పలు రికార్డులను ఊరిస్తున్నాయి. రికార్డులు అందుకోనున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతోపాటు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు.
మొదటి వన్డే మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రధానంగా వికెట్ కీపింగ్, స్పిన్ డిపార్ట్మెంట్లో ఎవరిని ఆడించాలనే విషయంలో మేనేజ్మెంట్కు సైతం తిప్పలు తప్పేలా లేవు. ఈ క్రమంలో మొదటి వన్డే మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.