Home » India
ఉత్కఠంగా సాగిన T20లో ఇండియా(India) ఓడిపోయింది. వెస్టిండీస్(West Indies) సునాయాసంగా గెలిచి టీమిండియా(Team India) గెలుపును దెబ్బకొట్టింది.
భారతదేశంతో అపరిష్కృతంగా (పరిష్కారం కానివి) ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా భారత్ స్పందించింది. పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో తమ దేశం స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోందని.. కానీ అందుకు ఉగ్రవాదరహిత వాతావరణం ఉండాలంటూ.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం కౌంటర్ ఇచ్చింది...
ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) భారత దేశానికి తీపి కబురు చెప్పింది. ప్రధాన ఆసియా ఆర్థిక వ్యవస్థల రేటింగ్స్‌ను సవరిస్తూ, భారత దేశ రేటింగ్‌ను ‘ఓవర్ వెయిట్’ (overweight)కు అప్‌గ్రేడ్ చేసింది. అదే సమయంలో చైనాకు చేదు వార్త వినిపిస్తూ, ఆ దేశ రేటింగ్‌ను ‘ఈక్వల్ వెయిట్ (equal-weight)’కు డౌన్‌గ్రేడ్ చేసింది.
పూర్వపు జమ్మూ-కశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించిన భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు బుధవారం నుంచి ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుపుతుంది.
తెగల మధ్య ఘర్షణలతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తంగా మారిన మణిపూర్‌లో సాధారణ స్థితిని సత్వరమే పునరుద్ధరించాలని మణిపూర్ గవర్నర్ అనుసుయియా యూకీ (Governor Anusuiya Uikey)ని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించి, సహాయక శిబిరాల్లోని బాధితులతో మాట్లాడారు.
మన దేశంలో పరిపుష్టమైన, సౌభాగ్యవంతమైన భాషలు అనేకం ఉన్నాయని, అయితే అవి ప్రగతి నిరోధక భాషలనే ముద్ర వేశారని, ఇంత కన్నా దురదృష్టం వేరొకటి ఉంటుందా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. జాతీయ విద్యా విధానం, 2020 మూడో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ఆయన ఆలిండియా ఎడ్యుకేషన్ కన్వెన్షన్‌ను ప్రారంభించారు.
వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 40 కోట్ల డాలర్ల (దాదాపు రూ.3,300 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికన్ సెమీకండక్టర్ (చిప్) కంపెనీ అడ్వాన్స్‌డ్ మైక్రో డివైజె్‌స (ఏఎండీ) ప్రకటించింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ హింసపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘర్షణలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
భారత దేశ గౌరవ, ప్రతిష్ఠలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటి వెళ్లగలమని భారత దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఈ దుందుడుకు వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది.
మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని 26 పార్టీల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఆమోదించారు. దీంతో.. త్వరలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు రంగం సిద్ధం కానుంది.