Home » IndiaVsEngland
ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 77 పరుగులు మాత్రమే చేశాడు.
బాజ్‌బాల్ వ్యూహంతో టీమిండియాను కూడా ఓడించాలని భావించిన ఇంగ్లండ్ వ్యూహం అంతగా ఫలించడం లేదు. ఈ మధ్యకాలంలో తమకు ఎదురైన అన్ని జట్లను బాజ్‌బాల్ వ్యూహంతో దెబ్బతీస్తున్న ఇంగ్లండ్ ఆటలు టీమిండియా దగ్గర మాత్రం అంతగా సాగడం లేదు.
రాజ్‌కోట్ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలో చోటు సంపాదించుకున్న 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.
పలు నివేదికల ప్రకారం ఈ నెల 23 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకు టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా దూరంకానున్నాడు. రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించనున్నారని సమాచారం.
ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన రోహిత్ సేన 434 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా బౌలర్లను ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూల్చింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన జైస్వాల్ డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపిస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ డబుల్ సెంచరీలతో దుమ్ములేపుతున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. తాజాగా రాజ్‌కోట్ వేదికగ జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ డబుల్ సెంచరీ కొట్టాడు.
టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీ 2024లో దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న పుజారా మూడు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారించాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్లందరూ తమ చేతులకు నల్లటి బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. ఇలా ఎందుకు ధరించారో చాలా మందికి అర్థం కాలేదు.
టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన టీమిండియా సినియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు.