IND vs ENG: బౌలింగ్ భారం అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తోంది.. రూట్ వైఫల్యంపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 20 , 2024 | 12:12 PM
ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 77 పరుగులు మాత్రమే చేశాడు.
ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 77 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాట్‌తో విఫలమైనప్పటికీ బాల్‌తో మాత్రం పర్వాలేదనిపిస్తున్నాడు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు తీశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన జోరూట్ ముగిసిన మూడు టెస్టుల్లో 100 ఓవర్లకుపైగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో రూట్ వైఫల్యం ఇంగ్లండ్‌కు మైనస్‌గా మారింది. ప్రస్తుతం ఆడుతున్న బ్యాటర్లలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రూట్ భారత్‌తో సిరీస్‌లో రాణించలేకపోతుండడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ స్పందించాడు. బౌలింగ్ పని భారం రూట్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘మీరు మీ అత్యుత్తమ బ్యాటర్‌ను నిజమైన ఆల్‌రౌండర్‌గా ఉండాలని, మీ ఫ్రంట్‌లైన్ స్పిన్నర్ల కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయమని అడిగినప్పుడు.. అతని బ్యాట్ నుంచి నచ్చిన ఔట్‌ఫుట్ రాకపోతే ఆశ్చర్యపోకండి. ఇంగ్లండ్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో జోరూట్ వారికి ఏకైక స్పిన్నర్ అని మాట్లాడుతున్నప్పుడు నేను దాని గురించి ఆలోచించాను. ఇది అర్థంలేని విషయం అని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. అతను ఒక ఫ్రంట్ లైన్ స్పిన్ బౌలర్‌గా ఎక్కువగా పని చేసినప్పుడు, మీరు అతని నుంచి బ్యాటుతో ఆశించిన ఫలితాలను వచ్చే అవకాశం లేదు. జాక్ లీచ్ గాయంతో దూరం అవడంతో ఇంగ్లండ్ ఏం చేస్తుందో నాకు కచ్చితంగా తెలియదు. కానీ ఇలాంటి బలహీన స్పిన్ అటాక్‌తో భారత్‌కు వెళ్లడంలోని మూర్ఖత్వాన్ని ఇది బయటపెడుతుంది. అయితే రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీ నిజంగా బాగా ఆడారు.’’ అని అన్నాడు. కాగా ముగిసిన 3 టెస్టుల్లో మొదటిది గెలిచిన ఇంగ్లండ్ మిగతా రెండింటిలో ఓడిపోయి సిరీస్‌లో వెనుకబడింది. సాధారణంగా మంచి బ్యాటరైనా జో రూట్ పార్ట్ స్పిన్నర్‌గానూ బౌలింగ్ చేస్తుంటాడు. ఇండియాలో స్పిన్ పిచ్‌లు ఉండడంతో రూట్‌ను ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయిస్తున్నారు. దీంతో అతను బ్యాటింగ్‌లో అంతగా రాణించలేకపోతున్నాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాడు. తాజాగా మార్క్ బౌచర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.