Home » Israel Hamas War
తమపై జరిపిన దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తూ వస్తున్న ఇజ్రాయెల్.. తాను హెచ్చరించినట్టుగానే శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మెరుపుదాడి చేసింది. అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇస్ఫహాన్‌పై.. డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది.
Israel Arrow System: పాత పౌరాణిక సినిమాల్లో యుద్ధాలు(War) గుర్తున్నాయా? కర్ణుడు ఆగ్నేయాస్త్రం వేస్తే.. అర్జునుడు సింపుల్‌గా వారుణాస్త్రం వేస్తాడు! రెండు బాణాలూ(Arrow) అర్ధ చంద్రాకారంలో పైకెళ్లి ఒకదాన్నొకటి ఢీకొంటాయి!! కాసేపటికి.. వారుణాస్త్రంలోని నీళ్లు ఆగ్నేయాస్త్రంలోని అగ్గిని ఆర్పేస్తాయి! ఇప్పుడు ఆ సీన్లో బాణాలకు బదులు రెండు క్షిపణులను(Missiles) ఊహించుకోండి.
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ‘గాజా యుద్ధం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్‌ని అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది.
ఇజ్రాయెల్(Israel)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరోసారి ఊపందుకున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ ప్రధాని( Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) రాజీనామా(resignation) చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆ క్రమంలో టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లో వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.
ఇజ్రాయెల్, హమాస్ (Israel Hamas War) మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు.. అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్‌కే (Israel) మద్దతు తెలిపింది. ఆ దేశానికి తనవంతు సహకారం అందించింది. కానీ.. గాజాలో (Gaza Strip) అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో, అమెరికా స్వరం మారింది. క్రమంగా ఆ అగ్రరాజ్యం ఇజ్రాయెల్ తీరుని తప్పుపడుతూ వచ్చింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి(Israel Hamas war) గాజా పౌరులు(gaza people) అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడి వారని ఆదుకునేందుకు పలు దేశాలు సహా ఐరాస రిలీఫ్ ప్యాకేజీలను పంపిస్తుంది. కానీ తాజాగా పంపించిన ప్యాకేజీ కూడా పలువురి పాలిట విషాదంగా మారింది.
ఇజ్రాయెల్‌పై సోమవారం క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో గల మార్గలియట్ వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు కేరళకు చెందిన వారని అధికారులు ప్రకటించారు.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి సపోర్ట్ చేస్తామని భారత్ వెల్లడించింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం(Israel hamas war) ఇంకా ముగియకపోగా..అది మరింత తీవ్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే గాజాలోని ఒక ఆసుపత్రి సమీపంలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 11 మంది మరణించారు.
ఇజ్రాయెల్, హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రధానమంత్రి మహమ్మద్ శతాయే (Mohammad Shtayyeh) ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పాలస్తీనా అధ్యక్షుడు మొహమూద్ అబ్బాస్‌కు (Mahmoud Abbas) సోమవారం అందజేశారు.