Home » ISRO
చంద్రయాన్-3 ఫలితాలు ప్రపంచం ముందుకు వస్తున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతల తీరు మొదటిసారి తెలిసింది.
తిరువనంతపురం: విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి అనే నామకరణ చేయడాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చైర్మన్ ఎస్.సోమనాథ్ సమర్ధించారు. ఇందులో తప్పేమీ లేదన్నారు. శివశక్తి , తిరంగా అనే రెండు పేర్లు భారతీయతకు చిహ్నమని అన్నారు.
భారతదేశం చంద్రయాన్-3 విజయంతో తన సత్తా చాటింది. అయితే ఈ విజయం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఇస్రో కష్టం ఈనాటిది కాదు. దానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 10ఫోటోలే సాక్ష్యం.
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో.. ఇప్పుడు ఇస్రో సూర్యుడి గురించి అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన ‘ఆదిత్య ఎల్-1’ సోలార్ మిషన్ను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది...
చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతేకాకుండా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా ఇండియా చరిత్రకెక్కింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-3 సక్సెస్ భారతీయులను గర్వపడేలా చేసిందని.. దీంతో ఆ ప్రయోగం విజయవంతమైన ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
భారత దేశం గగన్యాన్ మిషన్ లో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షానికి పంపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దీనికి సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో జరుగుతాయని తెలిపారు.
చంద్రయాన్-3ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసల్లో ముంచెత్తారు. గతంలో ఎవరూ సాధించని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారని చెప్పారు.
పీణ్యాలోని ఇస్రో కేంద్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. నేడు ఆయన దక్షిణాఫ్రికా నుంచి నేరుగా బెంగుళూరుకు వచ్చారు. బెంగుళూరు ఎయిర్పోర్టులో మోదీకి కర్ణాటక సీఎస్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్లో (Chandrayaan-3) భాగంగా విక్రమ్ ల్యాండర్ని (Vikram lander) సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సరికొత్త చరిత్ర సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈ అద్భుత విజయాన్ని సమస్త భారతావని వేడుకలా జరుపుకుంది. ప్రపంచదేశాలు సైతం జయహో భారత్ అని కీర్తించాయి.
చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక చంద్రుడిపై ల్యాండయిన ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ నుంచి బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి అందుతున్న సమాచారం ఆసక్తిని కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం రెండో వీడియోను విడుదల చేసింది.