Home » IT Raids
Telangana Elections: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీస్, నివాసాల్లో ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఐటీ అధికారుల ప్రవర్త సరిగా లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఐటీ అధికారులు పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 17లో ఉన్న 222/a ఇంట్లో, పొంగులేటి బంధువు నంద గిరి హిల్స్‌లోని బంధువు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.
పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వేధించేందుకే ఐటీ దాడులు చేయిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.
Telangana Elections: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, ఆఫీసులలో ఐటీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఖమ్మం, నారాయణపురం, హైదరాబాద్ మూడు ప్రాంతాలలో అయిదు చోట్ల ఏకదాటిగా అధికారులు దాడులు చేపట్టారు.
కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడేది లేదన్నారు. పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ అధికారులు పెద్దఎత్తున దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారన్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
నార్సింగ్‌లోని కేఎల్ఆర్ నివాసంలో నేడు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రి 1గంట వరకూ ఐటీ బృందం సోదాలు జరిపించింది. ఇంట్లో లభ్యం అయిన డాక్యుమెంట్స్‌ని అధికారులు తీసుకెళ్లారు.
బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఐటీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐదు గంటలుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ప్రొద్దుటూరు బంగారు షాపుల్లో గత 3 రోజులుగా ఐటీ అధికారుల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి.