శ్రీలలితా రైస్ ఇండస్ట్రీస్‌లో ఐటీ దాడులు
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:40 AM
పెద్దాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పెద్దాపురం శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ (ఇన్‌కంట్యాక్స్) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో సంస్థకు సంబంధించి పట్టణ పరిధిలో ఉన్న పలుచోట్ల ఈ సోదాలను ఐటీ అధికారులు చేపట్టారు
ఏకకాలంలో బృందాలుగా తనిఖీలు
మేనేజింగ్ డైరెక్టర్లు, బంధువులు, సిబ్బంది ఇళ్లలో సోదాలు
పెద్దాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పెద్దాపురం శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ (ఇన్‌కంట్యాక్స్) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో సంస్థకు సంబంధించి పట్టణ పరిధిలో ఉన్న పలుచోట్ల ఈ సోదాలను ఐటీ అధికారులు చేపట్టారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మట్టే సత్యప్రసాద్, శ్రీనివాస్ వారి బంధువులు, సిబ్బంది ఇళ్లలో ఏకకాలంలో బృం దాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహించారు. వాలు తిమ్మాపురం, వడ్లమూరు వెళ్లే రహదారిలో ఉన్న లలితా రైస్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు, వారి గృహాలు, గెస్ట్‌హౌస్‌లు, ఫామ్ హౌస్, సిబ్బంది క్వార్టర్స్‌లో కూడా ఐటీ అధికారులు తనిఖీ లను చేపట్టారు. సంస్థకు సంబంధించి ఉన్న కార్యాలయాల్లో గడచిన ఐదు సంవత్సరాల రికార్డులు, రసీదులు, ఆదాయం, చెల్లింపులు వంటి వాటితోపాటు కీలక పత్రాలు, కార్యాల యంలో కంప్యూటర్లను క్షుణ్ణంగా శోధించారు. ఆదాయం, మూలధనంపై పూర్తి దర్యాప్తు చేసినట్టు తెలిసింది. తెల్లవారు జామున 5.30 నుంచి రాత్రి వరకూ సోదాలు అధికారులు చేపట్టారు. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో ఉన్న కీలక పత్రా లు, డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలు వాటికి సం బంధించిన వివరాలను సేకరించినట్టు తెలిసింది. పట్టణంలో ఐటీ సోదాలు జరగడంతో పలువురు పారిశ్రామికవేత్తలు కంగారుపడ్డారు. ఐటీ అధికారులు దాడులు చేయడానికి కొద్ది రోజుల ముందు నుంచే వారిపై నిఘా ఉంచినట్టు తెలుస్తోం ది. ఐటీ బృందం స్థానికంగా ఓ హోటల్‌లో మకాం వేసి లక్షిత వ్యక్తుల సమస్త సమాచారాన్ని, వారి కదలికలను క్షుణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం. ఏకకాలంలో ఐటీ అధికారులు ఫ్యాక్టరీ, ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకోవడం, అక్కడ ఉన్న వ్యక్తులను బయటకు పంపకపోవడం, అలాగే రైస్ ఇండస్ట్రీస్‌లో ఉన్న సిబ్బంది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతోపాటు సిబ్బందిని ఎవరినీ లోపలకు అనుమతించలేదు. ఐటీ సోదాల సమయం లో కేంద్ర బలగాలతో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. స్థానికంగా ఉన్న పోలీస్ అధికారుల సహకారం ఏమాత్రం తీసుకోకుండా ఐటీ అధికారులు తమ తనిఖీలను చేపట్టారు. డాట్ టు డాట్ కనెక్షన్ విధానాన్ని అనుసరిస్తూ స్ట్రైక్ టైమ్ కంటే కొంత సమయం ముందే అధికారులు తమ సోదాలను నిర్వహించారు. దాడులకు కొద్దిగంటల ముందే కేంద్ర బల గాలు దాడులు చేపట్టే ప్రదేశానికి చేరుకున్నాయి. ఈ దాడులు మూడు రోజులపాటు జరగనున్నట్టు తెలిసింది. కీలక పత్రా లు, ఫైళ్లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.