Home » Jagan Mohan Reddy
‘ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’ అన్నది సూపర్ స్టార్ రజినీకాంత్ ‘బాషా’లోని ఓ ఫేమస్ డైలాగ్. ‘వంద మంది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టుకున్నా... ఒక్కదానికీ జవాబు చెప్పం’ అన్నది రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ బాషా తీరు! వైసీపీ హయాంలో ‘సమాచార హక్కు చట్టం’ ఉండీ లేనట్లుగా తయారైంది.
ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.
రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కౌంటర్(Minister Nara Lokesh) ఇచ్చారు. తనది రెడ్ బుక్ మాత్రమే కాదు.. ఓపెన్ బుక్ కూడా అంటూ జగన్ను ఉద్దేశిస్తూ ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ తప్పుకున్నారు. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్(ED) దాఖలు చేసిన కేసుల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
Andhrapradesh: ఏపీలో రాష్ట్రపతి పాలన అసాధ్యమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం రాజకీయాల్లో ఓనమాలు తెలియవని భావన కలుగుతోందన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. దివంగత నేత, మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు భగవంతుడితో సమానమన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం ఏమంత తేలిక కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి అర్థమైపోయింది. దాని పరిధిలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలు షాకింగ్ కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఉండి ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు తెలిపారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.
ప్రజలు అధికారం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. బాధ్యతతో వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికే అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నోసార్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు ఇంకా పూర్తికాలేదు. కానీ ఐదేళ్ల జగన్ పాలనతో పోల్చినప్పుడు 50 రోజుల్లోనే సీఎంగా చంద్రబాబు మార్క్ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైంది.