Minister Lokesh: నాది రెడ్ బుక్ మాత్రమే కాదు.. ఓపెన్ బుక్ కూడా: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Aug 14 , 2024 | 08:26 PM
రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కౌంటర్(Minister Nara Lokesh) ఇచ్చారు. తనది రెడ్ బుక్ మాత్రమే కాదు.. ఓపెన్ బుక్ కూడా అంటూ జగన్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
అమరావతి: రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కౌంటర్(Minister Nara Lokesh) ఇచ్చారు. తనది రెడ్ బుక్ మాత్రమే కాదు.. ఓపెన్ బుక్ కూడా అంటూ జగన్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన ట్వీట్ చేశారు. "నీలా నాకు క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్ వ్యవహారాలు, సీబీఐ కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలు వెళ్లాను. గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవడానికి నీకు కొంత టైమ్ పడుతుంది. సరే కానీ బాబాయ్(వివేకా)ను హత్య చేసింది ఎవరో చెప్పే దమ్ము నీకు ఉందా జగన్" అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
మరోవైపు గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. దాని సమూల ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు, విద్యారంగ నిపుణులతో ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 343ని విడుదల చేసినట్లు చెప్పారు. ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యుడు రాము సూర్యారావుని కమిటీ సభ్యుడిగా నియమించినట్లు వెల్లడించారు. ఏపీలో విద్యారంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి రాష్ట్ర ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఆర్థిక ఇబ్బందులు, పరిష్కారంపై దృష్టి..
CM Chandrababu: ఎన్టీపీసీతో చంద్రబాబు సర్కార్ కీలక ఒప్పందం.. 25ఏళ్లపాటు..
Supreme Court: జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ సంజయ్ కుమార్..