Share News

AP Politics: రెండు నెలల్లోనే జగన్, చంద్రబాబు మధ్య తేడా స్పష్టమైన తేడా..!

ABN , Publish Date - Aug 03 , 2024 | 09:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు ఇంకా పూర్తికాలేదు. కానీ ఐదేళ్ల జగన్ పాలనతో పోల్చినప్పుడు 50 రోజుల్లోనే సీఎంగా చంద్రబాబు మార్క్ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైంది.

AP Politics: రెండు నెలల్లోనే జగన్, చంద్రబాబు మధ్య తేడా స్పష్టమైన తేడా..!
Chandrababu and jagan

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు ఇంకా పూర్తికాలేదు. కానీ ఐదేళ్ల జగన్ పాలనతో పోల్చినప్పుడు 50 రోజుల్లోనే సీఎంగా చంద్రబాబు మార్క్ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమైపోతుందని.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి పధకాలు అందవని.. సంక్షేమం నిలిచిపోతుందని వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. కానీ గతంలో చంద్రబాబు పాలనను చూసిన ఏపీ ప్రజలు జగన్ మాయ మాటలను నమ్మలేదు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి.. ఎన్నికల్లో భారీ మెజార్టీని కట్టబెట్టారు. ప్రజలు జగన్ పాలనపై ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. ఈక్రమంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ప్రజల ఆకాంక్షలకు అనుగణంగా తన పాలన కొనసాగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఓ వైపు అభివృద్ధి.. మరో వైపు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ.. రాజకీయ కక్షలను పక్కనపెట్టి అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఐదేళ్లలో జగన్ పాలనతో విసుగుచెందిన ప్రజలు రెండు నెలల చంద్రబాబు పాలనపై ఏపీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

Chandrababu: వినతులు ఎన్ని ఉన్నా.. పరిష్కారమే లక్ష్యం!


పెన్షన్ పెంపు మొదలు..

2019 ఎన్నికల ముందు ఏపీ ప్రజలకు వైసీపీ అధినేత జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో కొన్ని అమలుచేశారు. ఆ పథకాల్లోనూ కొందరికి కోత పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన తరువాత నెల నుంచే పెన్షన్ల పెంపునకు శ్రీకారం చుట్టారు. జూన్ నెలతో పాటు ఏప్రియల్, మే నెలలకు గానూ పెంచిన ఫించను మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఆ తరువాత మధ్యలో నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగం పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు పారిశ్రామికవేత్తలు తమ సంస్థల శాఖలను ఏపీలో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాకపోగా.. కొందరు పారిశ్రామికతవేత్తలు వైసీపీ అరాచకాలు భరించలేక తమ సంస్థల శాఖలను ఏపీ నుంచి తరలించేశారు. చంద్రబాబు మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Purandeswari: చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పని చేస్తోంది


ప్రజాదర్బార్..

జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారని ప్రతి సంవత్సరం ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఒకసారి కూడా ఆయన స్వయంగా ప్రజాదర్బార్ నిర్వహించలేదు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలంటూ అధికారులకు తమ వినతిప్రతాలు ఇచ్చి వచ్చేవారు. లేదా ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాల్లో వినతిపత్రాలు అందించాల్సి వచ్చేది. కానీ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ప్రజాదర్బార్ నిర్వహిస్తు్నారు. ప్రతి నెల ఆయన స్వయంగా వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలంతా ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో తమ నాయకులకు ప్రజలు స్వయంగా వినతులు అందజేస్తున్నారు. కేవలం రెండు నెలల కాలంలోనే గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు చూస్తున్నారు. ఇద్దరి నాయకుల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుందనే చర్చ ఏపీ వ్యాప్తంగా సాగుతోంది.


Minister RamPrasad Reddy: ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest News Telugu

Updated Date - Aug 03 , 2024 | 09:15 PM