Home » Jammu and Kashmir
మోదీ ప్రభుత్వ 'నయా కశ్మీర్' నినాదంతో అసంతృప్తితోనే ప్రజలు తనను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించారని అవావీ ఇత్తేహాద్ పార్టీ చీఫ్ ఇంజనీర్ రషీద్ తనను బీజేపీ ప్రాక్సీగా మాట్లాడుతున్న వారు ముందుగా సిగ్గుపడాలన్నారు.
మరికొద్ది రోజుల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అలాంటి వేళ.. బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ బెయిల్ పై విడుదల కావడంతో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు.
కలయా? నిజమా? అన్నంతగా జమ్మూకశ్మీర్‌లో పదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించామని.. దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదం అంతిమ ఘడియల్లో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ఏళ్ల తరబడి జమ్మూకశ్మీర్‌లో పాలన సాగించిన కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌పై నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేంద్రం గణనీయంగా తీసుకువచ్చిన మార్పులను ప్రస్తావించారు. సంపన్న జమ్మూకశ్మీర్‌కు తాను గ్యారెంటీ ఇస్తున్నానని చెప్పారు.
నేడు జమ్మూకశ్మీర్‌లోని దోడాలో ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ(narendra Modi) ర్యాలీ నిర్వహించనున్నారు. దశాబ్దాలుగా ఉగ్రవాదంతో పోరాడుతున్న దోడాలో 45 ఏళ్ల తర్వాత ప్రధాని ర్యాలీ నిర్వహించడం విశేషం. అయితే నేడు ఇదే రాష్ట్రంలో కాల్పులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషాధ ఘటన దేశ సరిహిద్దు రాష్ట్రమైన జమ్మూ కశ్మీర్లో చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
గత ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశామని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు వెల్లడిస్తారన్నారు. 75 శాతం కంటే తక్కువ మంది ప్రజలు అలా కాదని సమాధానమిస్తే.. తాను లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న నయా కాశ్మీర్ కోసం తాను పోరాటం చేస్తానని జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ సభ్యుడు షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని తీహాడ్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.
కథువా-బసంత్‌గఢ్ సరిహ్దదు ప్రాంతంలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుందని డిఫెన్స్ పబ్లిక్స్ రిలేషన్స్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో హతులైన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ పౌరులుగా గుర్తించామని చెప్పారు.
వింగ్ కమాండర్ గత రెండేళ్లుగా తనను వేధిస్తూ లైంగిక దాడులు జరుపుతున్నట్టు పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. 2023 డిసెంబర్ 31న ఆఫీసర్స్ మెస్‌లో కొత్త సంవత్సరం పార్టీ జరిగిందని, గిఫ్ట్ పేరుతో గదికి తీసుకువెళ్లి తనపై లైంగిక దాడి జరిపినట్టు తెలిపింది.