Home » Jammu and Kashmir
శ్రీమాతా వైష్ణో దేవి ఆలయ సమీపంలో కొండ చరియలు ఆకస్మాత్తుగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారానికి తెర తీసింది. ‘ఖర్చే పే చర్చ’ పేరిట ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. బీజేపీ పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ తరహా ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల ‘చాయ్ పే చర్చ’ పేరిట రేడియోలో ప్రసంగిస్తున్న సంగతి తెలిసిందే.
దేశంలో అసాధారణ వర్షాలకు వాతావరణ మార్పులే కారణమా? రుతుపవనాలు తిరోగమనం చెందాల్సిన సమయంలో.. పశ్చిమ భారతాన్ని భారీ వర్షాలు.. వరదలు గడగడలాడిస్తుండడానికి కారణమిదేనా?
కీలకమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 4వ తేదీన రెండు ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ పాల్గొంటున్నారు.
జమ్మూకశ్మీర్‌లో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం కుప్వారా, మచ్చల్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి జరగనున్న తొలి దశ ఎన్నికల్లో మొత్తం 279 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అనంత్‌నాగ్ అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 72 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ దశలో 7 జిల్లాలోని మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వ్యాలీలోని 16 స్థానాలతోపాటు జమ్మూ ప్రాంతంలోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షుడి నియామకంపై కసరత్తు దాదాపు పూర్తయింది. కానీ, హరియాణా, జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే బీజేపీకొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
జమ్మూ-కశ్మీర్‌ను ఢిల్లీ నుంచి పాలించడంలో అర్థం లేదని కాంగ్రెస్ నాయకుడు, విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం సరికాదని, వెంటనే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండు చేశారు.
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. సోమవారం 44 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.