Home » Jammu and Kashmir
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 32 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తమ అభ్యర్థులను నిలబెడుతుంది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 15 మంది అభ్యర్థుల తొలి జాబితాను సోమవారంనాడు విడుదల చేసిన బీజేపీ తొలి విడత ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా విడుదల చేసింది. ఆ ప్రకారం జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉంటారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు విడతల్లో పోటీ చేసే 44 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను సోమవారం ఉదయం విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ కొద్ది గంటల్లోనే ఆ జాబితాను ఉపసంహరించుకుంది. కేవలం మొదటి విడతలో పోటీ చేసే 15 మంది అభ్యర్థులతో కొత్త జాబితాను విడుదల చేసింది.
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్(Ladakh)కు సంబంధించి ప్రధాని మోదీ(PM Modi) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సోమవారం ఉదయం విడుదలైంది. 44 మందితో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది.
తమ ఎన్నికల మేనిఫెస్టోకు అంగీకారం తెలిపితే కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిపై తమ అభ్యర్థులెవరినీ పోటీకి దింపమని, తాను కూడా పోటీ చేయనని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెమబూబా ముఫ్తీ చేసిన ప్రతిపాదనపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆదివారంనాడు స్పందించారు. రెండు పార్టీల ఎజెండాలు ఒకటేనని, తమ కూటమి అభ్యర్థులపై పీడీపీ పోటీకి దూరంగా ఉంటే సరిపోతుందని అన్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఏడుగురు అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ అదివారంనాడు ప్రకటించింది. వీటిలో పుల్వామా, రాజ్‌పోరా, దేవ్సర్, దూరు, దోడా, దోడా వెస్ట్, బనిహాల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నతంకాలం తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తన నిర్ణయం మార్చుకున్నారు.
తమ ఎన్నికల మేనిఫెస్టోకు అంగీకారం తెలిపితే నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్‌లతో పొత్తుకు సిద్ధమేనని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ఒకటయ్యాయి. పొత్తు కుదిరినా సీట్ల పంచాయతీ ఇంకా తెగలేదు.