మా అజెండాను అంగీకరిస్తే పొత్తుకు రెడీ: ముఫ్తీ
ABN , Publish Date - Aug 25 , 2024 | 04:11 AM
తమ ఎన్నికల మేనిఫెస్టోకు అంగీకారం తెలిపితే నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), కాంగ్రెస్‌లతో పొత్తుకు సిద్ధమేనని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ప్రకటించారు.
శ్రీనగర్, ఆగస్టు 24: తమ ఎన్నికల మేనిఫెస్టోకు అంగీకారం తెలిపితే నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), కాంగ్రెస్‌లతో పొత్తుకు సిద్ధమేనని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ శనివారం ఆమె ఎన్‌సీ, కాంగ్రె్‌సలకు ఆహ్వానం పంపారు. ప్రస్తుతం ఎన్‌సీ, కాంగ్రె్‌సల మధ్య కుదిరిన పొత్తుకు సీట్ల సర్దుబాటే ప్రధాన ప్రాతిపదిక తప్ప, ఎలాంటి ఉమ్మడి అజెండా లేదని అన్నారు.
నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌తో వ్యాపారాన్ని పునరుద్ధరించడం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం శారదా పీఠానికి మార్గాన్ని తెరవడం వంటి అంశాలు పీడీపీ అజెండాలో ఉన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి గతంలో ఉభయ దేశాల మధ్య వ్యాపారం జరిగేది. అయితే 370 అర్టికల్‌ను రద్దు చేసిన తరువాత 2019 నుంచి పాకిస్థాన్ ఆ వ్యాపారాలను రద్దు చేసింది.