Home » Jammu and Kashmir
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో టికెట్ల కేటాయింపు షురూ అయింది. దీంతో పార్టీలోని పలువురు నేతల్లో అసమ్మతి ఎగసి పడుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పొత్తు పెట్టుకుంది. దీంతో పలు సీట్లు కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది.
భారత సైన్యానికి చెందిన నిఘా డ్రోన్ ఒకటి అదుపు తప్పి పాకిస్థాన్ భూభాగంలో పడిపోయింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్లో నిఘా కోసం వినియోగిస్తున్న ఆ డ్రోన్ ...
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు తీవ్ర విమర్శలు గుప్పించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల మేనిఫెస్టోలో చెబుతున్న కీలకాంశాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటని నిలదీశారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. 90 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు అవగాహన కుదిరింది.
జమ్మూకశ్మీర్ ప్రజలతో తనది రక్తసంబంధమని, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడమే ఇండియా కూటమి ప్రాధాన్యమని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి తొలి విడత పోలింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇక అభ్యర్థుల నామినేషన్ గడువు ఆగస్ట్ 27వ తేదీతో ముగియనుంది.
ఆగస్ట్ 21, 22 తేదీల్లో జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతోపాటు పార్టీ శ్రేణులతో వారు భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకు కోవాల్సిన చర్యలపై వారితో వీరిరువురు చర్చిస్తారు.
జమ్మూ కశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలోని దుడు ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి మరణించారు. దుడు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను మరింతగా మోహరించేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో బెటాలియన్‌పై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగి.. కాల్పులు జరిపారు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం శ్రీనగర్‌లో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్టికల్ 370తోపాటు 35ఏని పునరుద్దరిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు మరో 10 అంశాలను మేనిఫెస్టో జాబితాలో పొందు పరిచారు.
ఆదివారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీందర్ రైనా మాట్లాడారు. త్వరలో తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. మొత్తం అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపుతామని ఆయన స్పష్టత ఇచ్చారు.