Share News

Jammu and Kashmir Elections: ఎన్‌సీ-కాంగ్రెస్ పొత్తు.. తొలిదశలో 13 సీట్లలో ఎన్‌సీ, 10 సీట్లలో కాంగ్రెస్ పోటీ

ABN , Publish Date - Aug 23 , 2024 | 02:53 PM

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. 90 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు అవగాహన కుదిరింది.

Jammu and Kashmir Elections: ఎన్‌సీ-కాంగ్రెస్ పొత్తు.. తొలిదశలో 13 సీట్లలో ఎన్‌సీ, 10 సీట్లలో కాంగ్రెస్ పోటీ

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Jammu and Kashmir elections) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. 90 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (Nationa conference), కాంగ్రెస్పా (Congress) పార్టీ మధ్య పొత్తు అవగాహన కుదిరింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 18న 24 స్థానాలకు జరిగే తొలివిడత ఎన్నికల్లో 13 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, 10 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో సీపీఎం పోటీ చేయనున్నాయి. 24 సీట్లలో 16 సీట్లు కశ్మీర్‌లో ఉండగా, 8 సీట్లు జమ్మూలో ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా నివాసంలో ఆయనతో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశమయ్యారు. అనంతరం సీట్ల షేరింగ్‌పై తాజా ప్రకటన వెలువడింది.


ఎన్‌సీ 12 కీలక వాగ్దానాలు

నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 12 కీలక హామీలు ఉన్నాయి. వాటిలో 370 అధికరణ పునరుద్ధరణ, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడం, 2000లో అప్పటి అసెంబ్లీలో ఆమోదించిన అటానమీ రిజల్యూషన్ అమలు వంటివి ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పొత్తు ప్రకటనను సీపీఎం నేత తరిగామి స్వాగతించారు. 2019లో 370వ అధికరణను రద్దు చేయడం,రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో తలెత్తిన పరిస్థితులు, ఎదురవతున్న సవాళ్ల నేపథ్యంలో ఎన్నికల ముందు పొత్తు అనివార్యమని అన్నారు.

Bangalore: సీఎంకు అండగా ఉంటాం.. గవర్నర్‌ తీరు ఆక్షేపణీయం


రాష్ట్ర హోదా పునరుద్ధరణే మా ప్రాధాన్యత: రాహుల్

జమ్మూకశ్మీర్ ప్రజల భావేద్వోగాలకు అనుగుణంగా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు 'ఇండియా' కూటమి తొలి ప్రాధాన్యత ఇస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. జమ్మూకశ్మీర్, లఢక్ ప్రాంత వాసులు తమ ప్రజాస్వామిక హక్కులను తిరిగి పొందేలా చేయడమే తమ పార్టీ ఉద్దేశ్యమని అన్నారు.

Read Latest National News And Telugu News

Updated Date - Aug 23 , 2024 | 03:25 PM