Home » Janasena
కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కూతురు ముద్రగడ క్రాంతిభారతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురలంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత కోసం ముద్రగడ ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి, పవన్ కల్యాణ్‌ను తన్ని తరిమేస్తానని అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగ గీత గెలవకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి భారతి స్పందించారు.
Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఒకేసారి, ఒకే చోట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు..
Andhrapradesh: ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై కూటమి నేతలు భేటీ అయ్యారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన కూటమి నేతలు... రాష్ట్రంలో ప్రధాని పర్యటన నిర్వహణపై మూడు పార్టీల నేతలు చర్చలు నిర్వహించారు. ఈనెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట, విజయవాడ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రధాని పర్యటన సాగనుంది.
Andhrapradesh: టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోపై కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల గళం నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని చెప్పుకొచ్చారు. గురువారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేడమే కూటమి మేనిఫెస్టో లక్ష్యమని స్పష్టం చేశారు.
గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా జనసేన పార్టీకి రిజర్వ్ చేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో కనుక్కొని సాయంత్రం నాలుగు గంటలకు కోర్టుకు చెప్పాలని ఎలక్షన్ కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం వద్ద డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స కోసం అరుణను ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్ నయవంచుకుడు, గుండా, దోపిడి దారుడు అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
Andhrapradesh: రెండవ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోదీలో కాన్ఫిడెన్స్ తగ్గిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ 200 స్థానాలు కూడా గెలవలేదన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తులో ఉందో తెలియడం లేదన్నారు.
Andhrapradesh: ‘‘మన అభిమాన హీరో చిరంజీవినే అవమానించిన జగన్ ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం మండపేట బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతూ... ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని.. రైతాంగానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు.