AP Elections: మేనిఫెస్టోతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యం: కూటమి నేతలు
ABN , Publish Date - May 02 , 2024 | 01:13 PM
Andhrapradesh: టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోపై కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల గళం నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని చెప్పుకొచ్చారు. గురువారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేడమే కూటమి మేనిఫెస్టో లక్ష్యమని స్పష్టం చేశారు.
అమరావతి, మే 2: టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోపై (Alliance Manifesto) కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల గళం నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని చెప్పుకొచ్చారు. గురువారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Leader Kommareddy Pattabhi Ram), బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ (BJP Leader lanka dinakar), జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ (Janasena leader Shivashanka) మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేడమే కూటమి మేనిఫెస్టో లక్ష్యమని స్పష్టం చేశారు. యువగళం, ప్రజాగళం, జనవాణిలు, కూటమి విడుదల చేసిన వాట్సాప్ నెంబర్‌కు వచ్చిన 1లక్షా 30వేల వినతుల ఆకాంక్షల్లో నుంచి మేనిఫెస్టోను రూపొందించామన్నారు.
AP News: పెన్షన్ కోసం వచ్చి కన్నీరు పెట్టుకుంటున్న వృద్ధులు.. కారణమిదే?
బాబు షూరిటీకి మోదీ గ్యారెంటీ తోడుగా ఉందని.. కూటమి మేనిఫోస్టోకు కేంద్ర సహకారం పూర్తిగా ఉందని తెలిపారు. కూటమి మేనిఫెస్టోలో ప్రాంతీయ సమత్యులత ఉందని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. జగన్ రెడ్డి తొత్తులతో కలిసి తయారు చేసిన మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. చిత్తుకాగితంగా జనం దాన్ని చెత్త బుట్టలో వేస్తున్నారని వ్యాఖ్యలు చేవారు. జగన్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. జగన్ మానసిక స్థితి దిగజారిపోయిందని విమర్శించారు. ‘‘యువతను నట్టేట ముంచాడు, రైతులను దగా చేశాడు, ఉద్యోగస్తులను హింసించాడు.. జగన్ రెడ్డిని జనాలు నమ్మడంలేదు’’ అని అన్నారు. కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని.. అందుకే అందరూ ఆదరించి పాలాభిషేకాలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపై ఉంటుందని... రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఉంటుందని కూటమి నేతలు వెల్లడించారు.
AP Elections 2024: గాజువాక ప్రజల అభిప్రాయాల మేరకు మేనిఫెస్టో: మంత్రి గుడివాడ
కూటమి పాలపలో రివర్స్ పీఆర్సీలు ఉండవన్నారు. వాలంటీర్ల జీతాలు పెంచి ఆదుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి పేదలను ఆదుకుంటామన్నారు. ఉచిత ఇసుక ఇస్తామన్నారు. ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మత సామరస్యంతో పనిచేసి అందరికి మేలు చేస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ డిక్లరేషన్ తో పంచాయతీలను అభివృద్ధి చేస్తామన్నారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ను నివారించి మాఫియాను అరికడతామని స్పష్టం చేశారు. కూటమి మేనిఫెస్టోతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అవుతుందని కూటమి నేతలు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్
Delhi: 223 మంది ఉద్యోగులు ఔట్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు
Read latest AP News And Telugu News