Ramakrishna: కూటమి మేనిఫెస్టోకు.. బీజేపీకి సంబంధం లేదు
ABN , Publish Date - May 01 , 2024 | 04:23 PM
Andhrapradesh: రెండవ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోదీలో కాన్ఫిడెన్స్ తగ్గిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ 200 స్థానాలు కూడా గెలవలేదన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తులో ఉందో తెలియడం లేదన్నారు.
రాజమండ్రి, మే 1: రెండవ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోదీలో (PM Modi) కాన్ఫిడెన్స్ తగ్గిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ (BJP) 200 స్థానాలు కూడా గెలవలేదన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తులో ఉందో తెలియడం లేదన్నారు. కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తున్నప్పుడు పక్కన పురందేశ్వరి (AP BJP Chief Purandenshwari) లేరన్నారు. పార్టీ అధ్యక్షురాలు లేకుండా మేనిఫెస్టో (Manifesto) ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని జైలులో నిర్బంధించి బీజేపీ లోబరుచుకుందని ఆరోపించారు.
Pawan Kalyan: చిరంజీవిని అవమానిస్తారా?.. జగన్‌కు టైం దగ్గరపడింది...
కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు బీజేపీ ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఇండియా కూటమి గెలవాలన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలకు అతీతంగా ఆలోచించుకోవాలని రామకృష్ణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth: నా గడ్డ మీద నన్నే బెదిరిస్తావా.. రేవంత్ మాస్ వార్నింగ్
Viral News: క్యాన్సర్ పేషెంట్‌కి బంపరాఫర్.. ఏకంగా రూ.10 వేల కోట్లు
Read Latest AP News And Telugu News