Home » Janasena
కాకినాడ జిల్లా: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో మూడో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం 10.45 కు ఉప్పాడలో పర్యటిస్తున్నారు. తీరంలో సముద్రపు కోతను ఆయన పరిశీలిస్తున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ధ మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు. గతంలో వైసీపీ హయాంలో అడిగేవారు లేకపోవడంతో అక్రమ కట్టడం గురించి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీశాఖ , కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
పిఠాపురం: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు.
హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు గట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్లోనే ఆయన ఉండనున్నారు.
అమరావతి: రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందన్నారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినా విద్యార్థులకు అందించే వేరుశనగ చిక్కీ ప్యాకెట్లపై ఇంకా జగన్ నామ స్మరణ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ల లాంటి చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా చిన్నపాటి ఉద్యోగుల కుటుంబాలు వేదనతో ఉన్నాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ... వాటిని నోట్ చేసుకున్నారు.