Share News

Deputy CM: వారిని నా కుటుంబ సభ్యులుగా పరిగణిస్తాను: డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:12 PM

అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ... వాటిని నోట్ చేసుకున్నారు.

Deputy CM: వారిని నా కుటుంబ సభ్యులుగా పరిగణిస్తాను: డిప్యూటీ సీఎం పవన్

అమరావతి: ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో (Employees) సమావేశం (Meeting) అయ్యారు. ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ... వాటిని నోట్ చేసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగులు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా పని చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో నాశనం అయిన వ్యవస్థలను గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పని చేద్దామని సూచించారు. ఉద్యోగులను చిన్నచూపు చూడనని.. వారిని తన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తానని స్పష్టం చేశారు.


సమస్యలను వినేందుకు, వాటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరిచేందుకు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సమస్యలను చెప్పడమే కాదు... ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం సూచించాలని ఉద్యోగులతో అన్నారు. భారత దేశం మెచ్చేలా, జాతి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేద్దామని పిలుపిచ్చారు. దీనికి తాను కంకణబద్ధుడినై పని చేస్తానన్నారు. తన ఒక్కడి వల్లనే ఈ మహా క్రతువు పూర్తి కాదని, ఉద్యోగుల సహకారం, సూచనలు చాలా అవసరమని.. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని బలంగా విశ్వసిస్తున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

మాజీ వైసీపీ ఎంపీకు హైకోర్టులో ఎదురుదెబ్బ

విచారణకు రావాలంటూ కేసీఆర్‌కు మరో లేఖ..

టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు?..

కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 26 , 2024 | 12:40 PM