Home » Jani Master
మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ద్వారా నిరూపితమయ్యే వరకు ఏ వ్యక్తీ నేరానికి పాల్పడినట్టు పరిగణించలేమంటూ ఆయన పోస్ట్ పెట్టారు. యూకేకి చెందిన ప్రఖ్యాత మాజీ జడ్జి, రాజకీయ నాయకుడు సర్ విలియం గారో చెప్పిన మాటలను ట్వీట్ చేశారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుుకుంది. జానీ మాస్టర్‌ని పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్‌ని పోలీసులు హాజరుపరుస్తున్నారు.
సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాపై మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు నమోదైంది.
అత్యాచార వేధింపుల కేసు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమ స్వరం పెంచింది. ఘటనపై పోలీసులతోపాటు టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ విచారణ జరుపుతోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(షేక్ జిలానీ బాషా)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ.. ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల వయసున్న యువతి తొలుత మహిళా భద్రత విభాగం డీజీ శిఖా గోయెల్‌కు ఫిర్యాదు చేశారు.
కొరియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా షేక్ జానీ ఉన్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఓ యువతి జానీ మాస్టర్‌పై అత్యాచారం ఆరోపణలు చేయడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు..
జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. కొంతకాలంగా జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో..