Home » JDS
లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండైన జనతాదళ్ (సెక్యులర్) నేత ప్రజ్వల్ రేవణ్ణ ఈ వారంలోనే జర్మనీ నుంచి తిరిగి రానున్నట్టు అధికార వర్గాల సమాచారం. మే 3-4 తేదీల మధ్యలో ఆయన స్వదేశానికి తిరిగి వస్తారని చెబుతున్నారు. సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసుపై సిట్ దర్యాప్తు జరుపుతోంది.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను హెచ్ డీ దేవగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. అదీకూడా లోక్సభ ఎన్నికల వేళ.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో.. సరైన ఆయుధం దొరికినట్లు అయింది.
కర్ణాటక రాజకీయాలను జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వీడియోలు కుదిపేస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జేడీ(ఎస్) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే హాసన్ లోక్సభ స్థానం నుంచి మళ్లీ ప్రజ్వల్ జేడీ(ఎస్) అభ్యర్థిగా బరిలో దిగారు.
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని క్షమించే ప్రసక్తే లేదని..
మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చేదు అనుభవం ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో రేవణ్ణను సంబంధించినట్టు చెబుతున్న ఒక అశ్లీల వీడియో పోస్ట్ కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తొలివిడత ప్రచారం మలివిడత నామినేషన్ల హోరు రాష్ట్రంలో ఎన్నికల వేడి పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్లకు ముందే ఒక విడత ప్రచారం ముగించిన ప్రధాని మరో పది రోజుల్లో రెండుసార్లు రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత, మండ్య లోక్సభ అభ్యర్థి హెచ్డీ కుమారస్వామి(HD Kumaraswamy)కి చెందిన బిడది తాలూకా కేతగానహళ్లి తోటలో ఉగాది పండుగ తర్వాత ఏర్పాటు చేసిన మాంసాహార విందుకు ఎన్నికల అధికారులు చెక్ పెట్టారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నారు.
కర్ణాటకలోని మండ్య నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన సుమలత అంబరీష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ( Lok Sabha Elections ) టికెట్ ఆశించి భంగపడిన సుమలత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
పోలింగ్ శాతం పెంచితే విజయం సునాయాసమవుతుందని, ఆ దిశగా శక్తికేంద్రం కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు.