Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ గెలుస్తారా.. ఆ సర్వేలో వెల్లడైందిదే
ABN , Publish Date - Jun 01 , 2024 | 09:48 PM
కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక వీడియోల కేసు ప్రధాన నిందితుడు హసన్ ఎంపీ, జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) మరోసారి ఎంపీగా గెలుస్తారా. ఇదే విషయంపై ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే నిర్వహించింది.
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక వీడియోల కేసు ప్రధాన నిందితుడు హసన్ ఎంపీ, జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) మరోసారి ఎంపీగా గెలుస్తారా. ఇదే విషయంపై ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే నిర్వహించింది. ప్రజ్వల్ జేడీఎస్ అభ్యర్థిగా మరోసారి హసన్ నుంచి పోటీ చేశారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పటేల్ పోటీకి దిగారు. రేవణ్ణ అక్కడ బలమైన నేత కావడంతో ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండియా టుడే అంచనా వేసింది.
అయితే అశ్లీల వీడియోల కేసు బయటపడుతున్న సమయంలోనే హసన్‌లో పోలింగ్ జరిగింది. అలా కాకుండా.. వివాదం పెద్దదిగా మారిన సమయంలో పోలింగ్ జరిగి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 2019లో ప్రజ్వల్ రేవణ్ణ 1.4 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మంజు హాసన్‌పై విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(ఎస్), బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై లక్ష ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కర్ణాటకలో ఎన్డీఏ స్వీప్..
మరోవైపు కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉంది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం కన్నడనాట ఎన్డీఏ కూటమి 20 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకుంటుంది. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ మూడు స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కర్ణాటకలో మొత్తం 28 ఎంపీ స్థానాలున్నాయి. ఇక్కడ 2 దశల్లో ఏప్రిల్ 26, మే 7న పోలింగ్ జరిగింది.
For Latest News and National News click here