Prajwal Revanna Scandal: పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి.. ఆ కేసు కారణంగానేనా
ABN , Publish Date - Jun 01 , 2024 | 09:21 PM
ప్రజ్వల్ రేవణ్ణ అశ్వీల వీడియోల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణ (Prajwal Revanna) జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కి గురైన విషయం తెలిసిందే. ఆమె తల్లి భవానీ రేవణ్ణను ఇంటి వద్దే ఉండాలని సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆమె ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.
బెంగళూరు: ప్రజ్వల్ రేవణ్ణ అశ్వీల వీడియోల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణ (Prajwal Revanna) జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కి గురైన విషయం తెలిసిందే. ఆమె తల్లి భవానీ రేవణ్ణను ఇంటి వద్దే ఉండాలని సిట్ నోటీసులు జారీ చేసింది.
అయితే ఆమె ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్నట్లు వారు అనుమానిస్తున్నారు. లైంగిక దాడి, కిడ్నాపింగ్ కేసుల్లో భవానీ రేవణ్ణ భర్త హెచ్డీ రేవణ్ణ కూడా నిందితుడే. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణ. ఇదే కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భవానీ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది.
ఇంటి పని సహాయకురాలి కిడ్నాపింగ్ కేసులో భవానీ రేవణ్ణ పాత్రను పరిశీలించాల్సి ఉంటుందని సిట్ వెల్లడించింది. ‘కేఆర్ నగర్ కిడ్నాప్ కేసుతో మీ పాత్రపై వివరణ కోసం మిమ్మల్ని మేం విచారిస్తాం. మీ అంగీకారం మేరకే వ్యక్తిగతంగా విచారణకు అందుబాటులో ఉండాలని మేం కోరాం. మహిళా పోలీసు అధికారులతో జూన్ ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు మిమ్మల్ని ప్రశ్నించేందుకు వస్తాం. మీరు ఇంట్లోనే ఉండాలని కోరతున్నాం’ అని నోటీసుల్లో పేర్కొంది.
శనివారం సిట్ ఆఫీసర్లు ఆమె ఇంటికి వెళ్లగా భవాని కనిపించలేదు. ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. సాయంత్రం ఐదు గంటల వరకూ సిట్ అధికారులు ఇంటి వద్దే ఎదురు చూశారు.
For Latest News and National News click here