Karnataka MP: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
ABN , Publish Date - May 29 , 2024 | 02:33 PM
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. మే 31వ తేదీ అంటే శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు చేరుకోనున్నారు. ఆ క్రమంలో కెంపె గౌడ ఎయిర్ పోర్ట్‌లో ప్రజ్వల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బెంగళూరు, మే 29: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. మే 31వ తేదీ అంటే శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు చేరుకోనున్నారు. ఆ క్రమంలో కెంపె గౌడ ఎయిర్ పోర్ట్‌లో ప్రజ్వల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: Bangladesh MP: సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం విడి భాగాలు
మరోవైపు తాను మే 31వ తేదీ ఉదయం 10.00 గంటలకు సిట్ అధికారుల ముందు హాజరవుతానంటూ ప్రజ్వల్ ఇటీవల.. ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాను పోలీసులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. తనకు న్యాయ వ్యవస్థపైన, చట్టాలపైన నమ్మకం ఉందని చెప్పారు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ప్రజ్వల్ ఈ సందర్బంగా ఆ వీడియోలో ఆరోపించిన విషయం విధితమే.
మరోవైపు మే 30వ తేదీ ఉదయం జర్మనీ నుంచి బెంగళూరుకు ప్రజ్వల్ బయలుదేరనున్నారని తెలుస్తుంది. ఇక ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన ప్రజ్వల్ వెంటనే జర్మనీ వెళ్లిపోయారు. ఇంకోవైపు సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజ్వల్ అంశం.. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి ఆస్త్రంగా మారింది. అదీకాక లోక్‌సభ ఎన్నికల బరిలో బీజేపీ, జేడీఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ యా పార్టీలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. దీంతో ప్రజ్వల్‌ను పార్టీ నుంచి జేడీ (ఎస్) సస్పెండ్ చేసింది.
Also Read: BJP: పవర్ ప్రాజెక్టులపేరుతో జగన్ భూసంతర్పణ: లంకా దినకర్
మరోవైపు ప్రజ్వల్ అంశంపై జేడీ (ఎస్) సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని దేవగౌడ్ కుటుంబంపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో దేవగౌడ.. తన మనవడు ప్రజ్వల్‌కు బహిరంగ లేఖ రాసి.. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగి వచ్చి.. పోలీసుల ఎదుట హాజరు కావాలన్నారు. ఈ విషయంలో తన సహానాన్ని పరీక్షించవద్దంటూ ప్రజ్వల్‌కు దేవగౌడ చురకలంటించారు.