Home » Jobs
నేరుగా నియామకాలు (లేటరల్ ఎంట్రీ) విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందేందుకు యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది.
మాదాపూర్లో మరో సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సోసైటీ 100ఫీట్ రోడ్లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులను భారీగా మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించారు.
ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు (ఆగస్టు 14, 2024) చివరి తేదీగా నిర్ణయించబడింది.
గురుకులాల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. గురుకుల బోర్డు తాజాగా చేపట్టిన 9,024 పోస్టుల భర్తీకి ఇదే విధానం అమలు చేయాలని కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడం, రీసెర్చ్కు సమృద్ధిగా నిధులులేకపోవడం వంటి కారణాలతో యూనివర్సిటీల్లో నాణ్యత క్రమంగా తరిగిపోతోంది.
చాలా మంది చిన్న విషయాలను చెప్పడానికి కూడా పెద్దగా ప్రయాస పడుతుంటారు. అనవసరమైనదంతా చెబుతుంటారు. మరికొందరు అత్యంత ముఖ్యమైన విషయాలను కూడా సింపుల్గా చెప్పేస్తుంటారు. వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి ఫర్వాలేదు గానీ, వృత్తి జీవితంలో ఏ విషయం చెప్పడానికైనా లెటర్ పెట్టాల్సిందే.
అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది, సర్కారు కొలువుదీరింది. తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కాలేజీల యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారు ఆశగా ఎదురుచూశారు.
ప్రతిభను ఏ ఆటంకం ఆపలేదని, కష్టపడి పడి చదివితే అనుకున్నది సాధించవచ్చని నిరూపించింది ఆ నిరుపేద యువతి.
జాబ్ క్యాలెండర్ ఒక పెద్ద జోక్ క్యాలెండర్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. బోగస్ ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురుచూసిన జాబ్ క్యాలెండర్ను ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా శుక్రవారం విడుదల చేసింది.