Share News

KTR: మిగిలిపోయిన పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి: కేటీఆర్..

ABN , Publish Date - Aug 13 , 2024 | 08:49 PM

గురుకులాల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. గురుకుల బోర్డు తాజాగా చేపట్టిన 9,024 పోస్టుల భర్తీకి ఇదే విధానం అమలు చేయాలని కేటీఆర్ అన్నారు.

KTR: మిగిలిపోయిన పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి: కేటీఆర్..
BRS Working President KTR

హైదరాబాద్: గురుకులాల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. గురుకుల బోర్డు తాజాగా చేపట్టిన 9,024 పోస్టుల భర్తీకి కూడా ఇదే విధానం అమలు చేయాలని కేటీఆర్ అన్నారు. గురుకులాల పోస్టుల భర్తీని తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసేలా చూడాలంటూ కేటీఆర్‌ను అభ్యర్థులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం వల్ల సెకండ్ మెరిట్‌లో ఉన్న వారికి నష్టం జరుగుతోందని అన్నారు. భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను మెరిట్ జాబితా ఆధారంగా పూరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.


ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 81పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తు చేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్లుగానే తాజాగా విడుదల చేసిన పోస్టుల్లో నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఫోన్ చేసి అభ్యర్థుల సమస్యను వారి ఎదుటే ఆమెకు వివరించి సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. గురుకుల అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Minister Uttam: ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో భారీ దోపిడీ చేశారు: మంత్రి ఉత్తమ్..

Sunkishala incident: సుంకిశాలను సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యేల బృందం..

BRS Leader Srinivas Goud: తెలంగాణ డెయిరీలను ఖతం చేసే కుట్ర జరుగుతోంది..

Bhatti Vikramarka: విద్యార్థుల మృతిపై ఆరా తీసిన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్..

Updated Date - Aug 13 , 2024 | 09:13 PM