Home » Joe Biden
అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు(US Elections 2024) జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 'భారీ' మొత్తం విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారి్‌సకు అధ్యక్ష పదవి చేపట్టేందుకు కావలసిన అన్ని అర్హతలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ స్థానంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామాను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్ (81) అభ్యర్థిత్వం డోలాయమానంలో పడింది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78)తో గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం) జరిగిన ప్రథమ చర్చలో.. పలు ప్రశ్నలకు జవాబులివ్వలేక తడబడిపోయారు.
ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు(us presidential election 2024) జరగనున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్(joe biden), అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(donald trump) మధ్య మొదటిసారిగా వాడివేడి చర్చ జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. గందరగోళంగా చూపులు చూడటం, వేదికపై మాట్లాడుతున్నప్పుడు బిగుసుకుపోవడం.. వంటి ఉదంతాలు..
ఇటలీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ-7 సమ్మిట్‌కు పలు అగ్రరాజ్యాల అధినేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే అక్కడ ఆయన వింత ప్రవర్తన చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
2024 అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించిన హుష్ మనీ కేసులో అమెరికా కోర్టు అయనను దోషిగా తేల్చింది. మొత్తం 34 కేసుల్లో ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చింది.
అరుదైన ఘటనకు అమెరికాలోని అధికార భవనం శ్వేత సౌధం (White House) వేదికగా మారింది. వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ మహ్మద్ ఇక్బాల్ రచించిన ‘సారే జహాసే అచ్ఛా’ను ప్లే చేయగా ఆహుతులంతా ఎంజాయ్ చేశారు. హెరిటేజ్ మంత్ వేడుకల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. వచ్చిన అతిథులంతా పానీ పూరి తింటూ మరోవైపు సారే జహాసే అచ్చా వింటూ మురిసిపోయారు.
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ‘గాజా యుద్ధం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్‌ని అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది.