Home » KA Paul
ఎంపీగా గెలిచి... పార్లమెంట్లో తాను అడుగు పెడితే విశాఖపట్నం నగరాభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు.. తనను ఎంపీగా కోరుకుంటున్నారన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) పలు రాజకీయ పార్టీలకు బంపరాఫర్ ప్రకటించారు. ఒక ఛానల్ నిర్వాహకులు తనను ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోమని అడిగారని చెప్పారు. అయితే తాను ఏ రాజకీయ నాయకుడు దేశాన్ని బాగు చేయలేదు కాబట్టి పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.
Andhrapradesh: గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే... తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా..ఆంధ్రను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) అసెంబ్లీ ఎన్నికలు మండు వేసవిలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఓ వైపు, వైసీపీ మరో వైపు తాడో పేడో తేల్చుకునేందురు రెడీ అవుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికలు-2024లో (Lok Sabha Polls) విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రజాశాంతి (Prajasanthi) పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావడం కొంత మందికి ఇష్టం లేదని అన్నారు. ‘‘ నేను సీఎం అయితే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తీరిపోతుంది. ప్రజలను బానిసలుగా ఉంచాలని పాలకులు చూస్తున్నారు ’’ అని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని దోచుకోడానికి కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Ka Paul) అన్నారు. సోమవారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... రాత్రికి రాత్రికి స్టీల్ ప్లాంట్‌ని అమ్మేశాయని.. ఈ విషయాన్ని తాను కోర్టులో చెప్పానని అన్నారు.
ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. అయితే తనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని ఆయన ఆరోపించారు.
విశాఖలో విలువైన భూములను వైసీపీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. సీబీసీఎన్సీ క్రైస్తవ భూములలో కేఏ పాల్, బాబు మోహన్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంవీవీ సత్యనారాయణ మనసు మార్చుకొని లాండ్స్‌ని బాపిస్ట్ సంఘాలకు సంబంధించిన యాజమాన్యానికి అప్పగించాలంటూ కేఏ పాల్ ప్రార్థన చేశారు.
బీజేపీ(BJP)కి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Ka Paul) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు. ఇటివలే తమ పార్టీలో చేరిన బాబు మోహన్ వరంగల్ నుంచి పోటీలో ఉంటారని అన్నారు. ఆయనకు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నామని తెలిపారు.