Share News

Tirumala Laddu: టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంలో కేఏపాల్ పిటిషన్

ABN , Publish Date - Oct 01 , 2024 | 02:15 PM

Andhrapradesh: కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతిని యూనియన్ టెర్రిటరీగా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి ఈ లడ్డూ వివాదం తీసుకొచ్చారని విమర్శించారు.

Tirumala Laddu: టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంలో కేఏపాల్ పిటిషన్
Prajashanti party Chief KA paul petition in Supreme Court on TTD Laddu dispute

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: తిరుపతి లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ (Prajashanti party Chief KA paul) సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని, తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. 740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని.. కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతిని యూనియన్ టెర్రిటరీగా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి ఈ లడ్డూ వివాదం తీసుకొచ్చారని విమర్శించారు. జూలై నెలలో నివేదిక వస్తే సెప్టెంబర్‌లో దీని గురించి మాట్లాడారన్నారు.

Sarpanch Elections: సర్పంచ్‌గా పోటీ చేసే ఆశావాహులకు శుభవార్త


కల్తీ అంటూ గందరగోళం..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారన్నారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులో మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. బాబు, పవన్ టీటీడీ లడ్డూ గురించి మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరానని తెలిపారు. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతూ ప్రజల్లో, భక్తుల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. వందల కొద్దీ భవంతులను ఎలాంటి నిబంధనలు, పద్ధతులు పాటించకుండా కూల్చేస్తున్నారని.. ఇదే విషయాన్ని నిన్న (సోమవారం) హైకోర్టు కూడా చెప్పిందన్నారు.

Huge scam: చెత్తనూ వదలని వైసీపీ.. భారీ స్కాం బట్టబయలు


టీటీడీ లడ్డూ తినను..

‘‘నేను మొదట భారతీయుడిని. హిందువుగా పుట్టాను. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తాను. నాకు మతాల కంటే ముందు మానవత్వం ముఖ్యం. పవన్ కళ్యాణ్ మొన్ననేమో ఆయన తను బాప్టిజం తీసుకున్నా, ఇజ్రాయెల్ సందర్శించా అన్నాడు. ఒకసారి ముస్లిం మతం మంచిది అన్నాడు. ఇప్పుడేమో సనాతన ధర్మం అంటూ ఊగిపోతున్నాడు. టీటీడీ లడ్డూ నేను తినను. జిలేబీ తినను. నేను ఎప్పుడూ వెళ్లి పూజ చేసింది లేదు. చర్చికి వెళ్ళలేదు. మసీదుకు వెళ్ళలేదు. గుడికి వెళ్ళలేదు. నేను మత మౌఢ్యంతో లేను. అన్ని మతాలను గౌరవిస్తాను. చర్చిల మీద ప్రభుత్వ పెత్తనం లేదు. అలాంటప్పుడు ఆలయాల మీద పెత్తనం దేనికి అని నేను ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉన్నాను’’ అని వెల్లడించారు.

Hyderabad: 10 రోజుల్లో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తాడనుకుంటే..



విభేదాలు సృష్టించేందుకు...

ప్రజాస్వామ్య దేశం మనది. ఇక్కడ ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందన్నారు. లడ్డూ వివాదంతో టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని... రాష్ట్రానికి వచ్చే భక్తులు తగ్గిపోతున్నారన్నారు. లడ్డూ వివాదం ద్వారా హిందువులకు, క్రైస్తవులకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని.. దీన్ని ఆపాలన్నారు. అందుకే సుప్రీంకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ కోరుతున్నట్లు కేఏ పాల్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Holidays: దసరా సెలవులు ప్రకటించిన సర్కార్

Huge scam: చెత్తనూ వదలని వైసీపీ.. భారీ స్కాం బట్టబయలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 04:15 PM