Share News

KA Paul - Hydra: హైకోర్టులో కేఏ పాల్ వాదనలు.. హైడ్రాకు న్యాయస్థానం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 07:43 PM

హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరో కీలక పరిణాామం చోటుచేసుకుంది. నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

KA Paul - Hydra: హైకోర్టులో కేఏ పాల్ వాదనలు.. హైడ్రాకు న్యాయస్థానం కీలక ఆదేశాలు

హైదరాబాద్: నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ (బుధవారం) విచారణ జరిగింది. ‘పార్టీ ఇన్ పర్సన్’గా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దంటూ హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయం చూసుకునేంతవరకు బాధితులకు సమయం ఇవ్వాలని స్పష్టం చేసింది.


ఇక మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులకు ఇళ్లు కట్టించిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. స్పందించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ బాధితులకు ఇళ్లు కేటాయించిన తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా హైకోర్టులో వాదనలు వినిపించే సందర్భంలో కేఏ పాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని చూస్తున్నారని అన్నారు.


ఇవి కూడా చదవండి

HCA: హెచ్‌సీఏ వివాదాలపై సుప్రీంకోర్టులో విచారణ

ఏపీలో లా అండ్ అర్డర్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

తుపాను ఎఫెక్ట్.. రెండు రైళ్లు రద్దు

For more TS News and Telugu News

Updated Date - Oct 23 , 2024 | 07:50 PM