Share News

KA Paul: ఆ విషయంలో చంద్రబాబు కూడా బాధపడుతున్నారు

ABN , Publish Date - Aug 14 , 2024 | 01:32 PM

Andhrapradesh: గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారన్నారు.

KA Paul: ఆ విషయంలో చంద్రబాబు కూడా బాధపడుతున్నారు
Prajashanti Party Chief KApaul

అమరావతి, ఆగస్టు 14: గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prajashanti Party Chief KApaul) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారన్నారు. అక్టోబర్ రెండో తేదీన లాస్ ఎంజెల్సులో గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ జరుపుతున్నామన్నారు. ఈ సమావేశానికి మద్దతివ్వాల్సిందిగా సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నామన్నారు.

Flag Hoisting: స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవం మధ్య తేడాలు మీకు తెలుసా?


తెలుగు రాష్ట్రాలూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు.ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతున్నానని చంద్రబాబు కూడా బాధ పడ్డారన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని వెల్లడించారు. రాష్ట్రం కోసం చంద్రబాబుతో కలిసి పని చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు వస్తే అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలిపిస్తానన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి చంద్రబాబుకు సహకరిస్తానన్నారు. వివిధ దేశాల కౌన్సిల్ జనరల్సుతో చంద్రబాబు భేటీ అవుతున్నా.. ఉపయోగం లేదని తెలిపారు.

AP Politics: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్లాన్ ఇదేనా..?


ఆయా దేశాధినేతలు.. పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలే పెట్టుబడులు ఇవ్వగలరన్నారు. ‘‘నేను వాళ్లందర్నీ కలిపిస్తాను. నా మద్దతు తీసుకోకుంటే ఏపీకి కంపెనీలు రావు. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలలోగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగలను. చంద్రబాబు ఏపీ సీఎం కాబట్టి లాస్ ఏంజెల్సులో జరిగే గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ వస్తేనే ఇది సాధ్యమవుతుంది’’ అని వెల్లడించారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఎఫ్సీఆర్ఏ ఇస్తే తన ట్రస్ట్ ద్వారా నెల రోజుల్లో రూ. 8 వేల కోట్లు తెస్తానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా జస్టిస్ శేషసాయి చక్కటి తీర్పు ఇచ్చారన్నారు.



ఖజానాలో డబ్బుల్లేవని.. హామీలు అమలు చేయలేమని చంద్రబాబుకు ఎప్పుడో తెలుసని.. కానీ ఓట్లు పడవని చెప్పలేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖజానా గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. విశాఖలో జరిగిన సదస్సులో సూట్ బూట్ వేయించి నూడుల్స్ అమ్ముకునే వాడితో ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ‘‘నేను ప్రపంచ కుబేరులను రాష్ట్రానికి తెచ్చాను. కేరళకు కొన్ని పెట్టుబడులు ఇప్పించాను. నేను చంద్రబాబును కలవడానికి సిద్ధం.. నన్ను కలవడానికి చంద్రబాబు సిద్దమా..? ఎన్డీఏకు మద్దతిచ్చే సందర్భంలోనే చంద్రబాబు కొన్ని డిమాండ్లు పెట్టి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది’’ అని కేఏపాల్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Angara Rammohan: అవినీతి ఇంకా సాగవు జోగి.. గుర్తు పెట్టుకో

Sujana chowdary: లాభనష్టాలతో సంబంధం లేకుండా వ్యవసాయం చేసేవాడే రైతు...

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 14 , 2024 | 01:39 PM