Home » Kakatiya University
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి.
కాకతీయ యూనివర్సిటీ(కేయూ) సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్‌బాబును సస్పెండ్ చేస్తూ బుధవారం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు నేపథ్యంలో వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కృతజ్ఞత సభ ఈ నెల 28న జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 3న సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ లోపే సభ నిర్వహించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్‌లో మరో దారుణం జరిగింది. జూన్ 28న ఇదే హాస్టల్‌లో ఓ విద్యార్థిని తలపై సీలింగ్ ఫ్యాన్ పడి తీవ్ర గాయమైన ఘటనను మరువక ముందే.. శుక్రవారం రాత్రి హాస్టల్ మూడో అంతస్థులోని రూం నం.94లో శ్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి.
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం వెల్లడించింది.
కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ తాటికొండ రమే్‌షపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధుల నుంచి టెర్మినేట్ చేసిన బోధనా సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా విధుల్లోకి తీసుకోవడం, అక్రమ బదిలీలు, నియామకాలు, నకిలీ ప్రాజెక్టులు ఆమోదించి అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు గతంలో అనేకసార్లు ఆరోపించారు.
హనుమకొండ, కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనెట్‌హాల్‌లో ఆదివారం ఘర్షణ వాతావరణం నెలకొంది. ‘లౌకిక విలువలు- సాహిత్యం’ అనే అంశంపై సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సును ఏబీవీపీ కార్యకర్తలు, పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు.
వరంగల్: తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖలు ఆదివారం వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీకి వెళ్లనున్నారు. వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను పరిశోధనల వైపు నడిపించేందుకు అడుగులు పడుతున్నాయి.