Home » Kaleshwaram Project
గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ/రిజర్వాయర్ నిర్మిస్తామని ఇంతకాలం పట్టుబట్టిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఒక మెట్టు దిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ (Kaleswaram Commission Chairman Chief Justice Chandraghosh) విచారణలో వేగం పెంచారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే దాదాపు 71 కిలోమీటర్ల వరకూ గ్రావిటీతో వచ్చే నీళ్లను కాదని కాళేశ్వరం ఎత్తిపోతలను ఎందుకు చేపట్టారనే అంశంపై జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ దృష్టి సారించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బ్యారేజీల నిర్మాణంపై విచారణ ఊపందుకుంది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగుబాటు, పియర్స్, గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు సహా పలు సమస్యలపై విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh)న్యాయ విచారణ కమిషన్‌ను హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజనీర్లు కలిశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని గత ప్రభుత్వం తమపై ఒత్తిడి చేసిందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఆ ఒత్తిడితో నిర్మించడం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి.
విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందినట్లు కాళేశ్వరం (Kaleshwaram) విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ (Chief Justice Chandra Ghosh) వెల్లడించారు. ఆ మేరకు ఆయన ఏజెన్సీలతో సమావేశమయ్యారు. అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా వారిని ఆదేశించారు.
విద్యుత్ కొనుగోళ్లు , కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ(Kaleswaram project)పై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ఎందుకు లీకులు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగు నీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంతో ముడిపడిన అంశాలపై వివరాలు చెప్పే అధికారులు.. వాటికి కట్టుబడి ఉండాలని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ అన్నారు. విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్లో పొందుపరచాలన్నారు. అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు వాస్తవ విరుద్ధంగా ఉంటే ఆయా అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.