TG News: విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి: కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:58 PM
విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందినట్లు కాళేశ్వరం (Kaleshwaram) విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ (Chief Justice Chandra Ghosh) వెల్లడించారు. ఆ మేరకు ఆయన ఏజెన్సీలతో సమావేశమయ్యారు. అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా వారిని ఆదేశించారు.
హైదరాబాద్: విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందినట్లు కాళేశ్వరం(Kaleshwaram) విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ (Chief Justice Chandra Ghosh) వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఏజెన్సీలతో సమావేశమయ్యారు. అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా వారిని ఆదేశించారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలనే అఫిడవిట్ ఫైల్ చేయమన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రఘోష్ మాట్లాడుతూ.." టైం బౌండ్ గురించి ఏజెన్సీలందురూ చెప్తున్నారు. ప్రభుత్వం విధించిన సమయంలోపే ప్రాజెక్టు అందించినట్లు వారు చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం, డిజైన్, నిర్వహణ గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఎజెన్సీలను ఆదేశించా. కమిషన్‌కు ఎవరు ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలి. ఈ నెలాఖరు లోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశించినట్లు" ఆయన వెల్లడించారు.
ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను సైతం విచారణకు పిలుస్తామని జస్టిస్ చంద్రఘోష్ తెలిపారు. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ల అఫిడవిట్ వచ్చాక.. ఇతరులను కూడా పిలుస్తామన్నారు. కొంతమంది అధికారులు రాష్ట్రంలో లేరని, వాళ్లనూ విచారణ చేస్తామన్నారు. తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసినట్లు తమ దృష్టికి వస్తే తెలిసిపోతుందని.. వారిపై తగిన చర్యలు ఉంటాయని జస్టిస్ చంద్రఘోష్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
Jagadish Reddy: కమిషన్ల పేరుతో ప్రజల దృష్టి మరలిస్తున్నారు: మాజీమంత్రి జగదీశ్ రెడ్డి
Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చంపేస్తానని బెదిరించిన సైబర్ నేరగాడి అరెస్ట్