Share News

TG Politics: కేసీఆర్ సూచన మేరకే కాళేశ్వరం నిర్మాణం.: కమిటీ రిపోర్ట్

ABN , Publish Date - Jun 15 , 2024 | 03:33 PM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ (Kaleswaram Commission Chairman Chief Justice Chandraghosh) విచారణలో వేగం పెంచారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

TG Politics: కేసీఆర్ సూచన మేరకే కాళేశ్వరం నిర్మాణం.: కమిటీ రిపోర్ట్

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ వేగాన్ని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ (Kaleswaram Commission Chairman Chief Justice Chandraghosh) వేగం పెంచారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ఈరోజు(శనివారం) కాళేశ్వరం కమిషన్‌ను కలిసింది.

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అక్కడే ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ (KCR) సూచనల మేరకే పనులు చేసినట్లు కమిషన్‌కు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ (Retired Engineers Committee Report) సమర్పించింది. మూడు బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను కాళేశ్వరం కమిషన్ గుర్తించే పనిలో పడింది. సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది.


అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యాచరణను కమిషన్ ప్రారంభించింది. అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను విచారణకు పిలిచి వారి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో కాళేశ్వరం కమిషన్ దృష్టి సారించింది. అఫిడవిట్ పరిశీలన తర్వాత ఓపెన్ కోర్టులోనే మరోసారి అందరిని కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నట్లు సమాచారం.


కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బ్యారేజీల నిర్మాణంపై విచారణను ముమ్మరం చేసింది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్ధమైన తర్వాత ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇస్తామని తెలిపారు. మాజీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విచారణకు పిలుస్తామని వెల్లడించారు.


జూలై రెండో వారం లేదంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని చంద్రఘోష్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మంత్రి హరీశ్‌ రావుకు త్వరలో నోటీసులు అందే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి

KCR: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా లేదు: కేసీఆర్

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

YS Jagan: వైఎస్ జగన్‌ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేత!

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 03:56 PM