Home » Kaleshwaram Project
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleswaram project) జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ (Justice Chandra Ghosh) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించారు.
వానాకాలంలో అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కెమికల్ గ్రౌటింగ్, సిమెంట్ అడ్మిక్చర్ గ్రౌటింగ్ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియ సోమవారం నుంచి ఊపందుకోనుంది. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారణ జరుపుతున్న సంగతి విదితమే.
మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స(సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) బృందం పరీక్షలు నాలుగో రోజైన శనివారం కూడా కొనసాగాయి. కుంగిన ప్రతి పిల్లరుతోపాటు గేట్ల ముందున్న బే ఏరియాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిర్ణీత వ్యవధిలోగా మరమ్మతులు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మరమ్మతు పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. నిన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికలతో కోడ్ ఉండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ సాధ్యం కాలేదని తెలిపారు.
రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎన్డీఎ్సఏ మధ్యంతర నివేదిక ప్రకారం మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శుక్రవారం ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ సందర్శించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. 7న అన్నారం, 8న సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈనెల 10వ తేదీలోపు బ్యారేజీలకు మరమ్మతులు/పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే. నిపుణుల కమిటీ కూడా ఇప్పటికే బ్యారేజీలను పరిశీలించింది.
‘‘సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయ రాజులను నేను చూస్తా. పన్నులు చెల్లించబోం అని అన్నందుకు ఆ గిరిజన యోధులపై దాడి చేసి హతమార్చారు. రుద్రమదేవి హయాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంతులు కాపాడారు. ప్రతాపరుద్రుడు వచ్చాక పద్మనాయకులను చేరదీశాడు. వారు చేయివ్వడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ శనివారం సందర్శించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయమందించేందుకు ఈ కమిటీని వేసిన సంగతి తెలిసిందే.