Share News

Kaleswaram: కాళేశ్వరం అవకతవకలపై 54 ఫిర్యాదులు.. చంద్ర ఘోష్ కమిటీ విచారణ వేగవంతం

ABN , Publish Date - Jun 10 , 2024 | 04:31 PM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleswaram project) జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ (Justice Chandra Ghosh) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించారు.

Kaleswaram: కాళేశ్వరం అవకతవకలపై 54 ఫిర్యాదులు..  చంద్ర ఘోష్ కమిటీ విచారణ వేగవంతం
Justice Chandra Ghosh

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleswaram project) జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ (Justice Chandra Ghosh) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ కమిటీ దృష్టి సారించింది. కమిటీకి ఈ ప్రాజెక్ట్‌పై పలు ఫిర్యాదులు అందడంతో విచారణను ముమ్మరం చేసింది, విచారణకు సంబంధించిన పలు విషయాలను నేడు (సోమవారం) మీడియాకు కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్ర ఘోష్ వెల్లడించారు.

విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు. ఈరోజు(సోమవారం) 7 మందికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని అన్నారు. రేపు 18 మంది విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని చెప్పారు. మొన్నటి వరకు తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఉందని.. అందుకే కొంత ఆలస్యం అవుతుందని అన్నారు. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయని స్పష్టం చేశారు. విచారణకు వచ్చే అధికారులకు నోటీస్ ఇచ్చామన్నారు.


ప్రాజెక్ట్ అవకతవకలపై 54 ఫిర్యాదులు వచ్చాయని.. విచారణ ముమ్మరం చేస్తామన్నారు. ఫిర్యాదులో నష్టపరిహారానికి సంబంధించినవి కూడా వచ్చాయని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌కు కట్టిన ఏజెన్సీలను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశామని అన్నారు. నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్దా ఉన్న సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు.


జూన్ 30వ తేదీ లోపు విచారణ పూర్తి కాదని.. ఇంకా సమయం పడుతుందని చెప్పారు. విచారణ వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని అన్నారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక, రెగ్యూలర్, ఆర్థిక, అంశాలపై విచారణ మొదలు అవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి రిపోర్టులు అన్ని అందాయని.. వాటి పరిశీలన జరుగుతుందని చంద్ర ఘోష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Telangana Politics: గులాబీ బాస్ కీలక నిర్ణయం.. కేటీఆర్ ఔట్.. ఆ పదవి ఎవరికంటే..?

Kishan Reddy: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా..: కిషన్ రెడ్డి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 10 , 2024 | 05:22 PM